ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారుల నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2020-12-02T04:42:29+05:30
ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారుల నిర్లక్ష్యం వలనే ఏటా రైతులు ముంపుతో నష్టపోతున్నారని వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ నంద్యాల సీతారామయ్య అన్నారు.
ఆకివీడు, డిసెంబరు 1: ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారుల నిర్లక్ష్యం వలనే ఏటా రైతులు ముంపుతో నష్టపోతున్నారని వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ నంద్యాల సీతారామయ్య అన్నారు. వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశం ఏవో ప్రియాంక అధ్యక్షతన మంగళవారం జరిగింది. రైతులు తోట శివాజి, తోట దుర్గారావు మాట్లాడుతూ విత్తనాల కొరత ఉందన్నారు. మురుగు కాల్వలో తూడు, గుర్రపుడెక్క, చెత్త తొలగించపోతే దాళ్వా ఆకుమడులకే నీటి కొరత ఏర్పడుతుందన్నారు. రొయ్యల చెరువుల వ్యర్థాలతో వరి రైతులు నష్టపోతున్నారని, భూమి చౌడు బారుతుందన్నారు. వ్యవసాయశాఖ ఏడీ ఈదా అనిల్‌కుమారి, వెటర్నరీ ఏడీ కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రబీ నాట్లు త్వరితంగా వేయాలన్నారు. ముంపు గ్రామాల్లో పశు పోషకులకు దాణా ఉచితంగా సరఫరా చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యకుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-12-02T04:42:29+05:30 IST