ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరస్మరణీయుడు మాణిక్యాలరావు

ABN, First Publish Date - 2020-08-09T11:36:20+05:30

పార్టీ కార్యకర్త నుంచి, రాష్ట్ర మంత్రిగా నిరాడంబరంగా జీవించి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రజల మనస్సులో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 8 : పార్టీ కార్యకర్త నుంచి, రాష్ట్ర మంత్రిగా నిరాడంబరంగా జీవించి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మాణిక్యాలరావుపై చిత్రీకరించిన లఘు చిత్రాన్ని శనివారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శించారు. ముఖ్య నాయకులంతా వర్చువల్‌ సంతాప కార్యక్రమం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ డియోధర్‌, కన్నా లక్ష్మీనారాయణ, కంభంపాటి హరిబాబు, భారత్‌జి, భాగయ్య, సతీష్‌ పాల్గొన్నారు. స్థానికంగా బీజేపీ ఈతకోట తాతాజీ, నార్ని తాతాజీ, గట్టిం మాణిక్యాలరావు, పసుపులేటి రామారావు పాల్గొన్నారు. 


పెంటపాడు : నియోజవర్గంలోని ఎస్సీ కాలనీలలో 27 రామాలయాలను నిర్మించిన ఘనత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుదని మాజీ ఎంపీటీసీ రేవళ్ళ సోమరాజు అన్నారు. శనివారం ప్రత్తిపాడులోని వీర్ల వేణు గృహ ఆవరణలో మాణిక్యాలరావుకు సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమంలో వీర్ల కృష్ణ, వీర్ల వెంకటేష్‌, పసుపులేటి అమ్మిరాజు, అంజి, కూచి ఉమాదేవి, జామి ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T11:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising