ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద కష్టాలు

ABN, First Publish Date - 2020-10-31T04:18:17+05:30

ఆకివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో గ్రామంలో వరద ముంపు పట్టిపీడిస్తోంది. 15 రోజులకు పైగా ఉన్న ముంపులో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆకివీడు పట్టణం మాదివాడలో ముంపులో ఉన్న చేలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లు, చేలు ముంపులోనే

కుళ్లిన వరి చేలు

వ్యాధుల భయం

నీటిలోనే రాకపోకలు

ఆకివీడు, అక్టోబరు 30: ఆకివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో గ్రామంలో వరద ముంపు పట్టిపీడిస్తోంది. 15 రోజులకు పైగా ఉన్న ముంపులో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ చేలు, ఇళ్లు ముంపు లో ఉండడంతో అంటు వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నా రు. ఆకివీడు పట్టణంలో సమతానగర్‌, ధర్మాపురం అగ్రహారం ప్రాంతాలు, ఆకివీడు – సిద్ధాపురం, గుమ్ములూరు రహదారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముంపు బాధితులతోపాటు ఇతర ప్రాంతాల వారు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ముంపు కొనసాగడంతో నీరు రంగుమారి దుర్వాసన వస్తోంది. మరోవైపు తాగునీరు లేక దాహంతో అలమటిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. గ్యాస్‌, వైద్యం, నిత్యావసర వస్తువుల దొరకడం లేదు. సరుకులు అధిక ధరలకు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. భూములు నీట మునగడంతో పశుగ్రాసం లేక పాడి పశువులు అల్లాడుతున్నాయి. అధికారులు, పాలకులు చినకాపవరం, అయిశా మురుగు కాల్వలు ప్రక్షాళన చేయించితే గాని వరద ముంపునీరు తగ్గదంటున్నారు.


వరదపోయింది.. రైతుకు నష్టం మిగిలింది

పాలకోడేరు: సార్వా సాగు కష్టనష్టాలతో ఆరంభమైంది. అధిక వర్షాలతో చేలు ముంపుబారిన పడడంతో కష్టం కొట్టుకుపోయి నష్టం మిగిలిందని రైతులు వాపుతున్నారు. రోజుల తరబడి నీటిలో మునిగిన చేల నుంచి నీరు పోయినా పైరు కుళ్లిపోయింది. నీరు తొలగడంతో నష్టం కళ్లముందు కనిపి స్తుందని రైతులు గొల్లుమంటున్నారు. మోగల్లు, గుత్తులవారిపాలెంలో సుమారు 2500 ఎకరాల్లో వరి పనికిరాకుండా పోయిందని రైతులు చెబుతు న్నారు. మిగిలిన గ్రామాలలో గింజలు గట్టిబడకుండా తెగుళ్లు వెంటాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









Updated Date - 2020-10-31T04:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising