ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంజనీరింగ్‌ టెన్షన్‌!

ABN, First Publish Date - 2020-11-01T04:59:44+05:30

ఇంజనీరింగ్‌ విద్య టెన్షన్‌.. టెన్షన్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆప్షన్లకు అవకాశం లేదు.. ఫీజులపై స్పష్టత లేదు

ప్రారంభంకాని తరగతులు

భీమవరం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 31 : ఇంజనీరింగ్‌ విద్య టెన్షన్‌.. టెన్షన్‌గా మారింది. సీట్లు భర్తీ ఎలా ఉంటుందోనని కళాశాల యాజమాన్యాలు టెన్షన్‌ పడుతుండగా.. మరో పక్క కళాశాలల ఎంపిక ఎప్పుడో అన్న ఆలోచనలు విద్యార్థుల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో 17 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 10,392 సీట్లు ఉన్నాయి. కన్వీనర్‌ కోటా సీట్లు 7045, మేనేజ్‌మెంట్‌ సీట్లు 3347 ఉన్నాయి. గతేడాది కన్వీనర్‌ కోటాలో 5018 సీట్లు భర్తీ అయి 2027 సీట్లు మిగిలిపో యాయి. ప్రతీ ఏడాది ఎంతో సాఫీగా సాగే ప్రక్రియ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం అయోమయంలో పడిపో యింది.మరో వైపు ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రారంభంపై ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మూడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, డెటా సైన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ అనే మూడు కొత్త కోర్సులు చేర్చారు. ఇవి కొన్ని కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 సీట్లు ఉంటాయి.

విద్యార్థుల్లో గందరగోళం.. 

ఎంసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన గత నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ లో చేశారు. అయితే గతంలో అయితే సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుండగానే కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. దానిలో మార్పు ఇప్పుడు విద్యార్థుల్లో ఒత్తిడిగా మారింది. కళాశాలల ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులపై స్పష్టత లేకుండా పోయింది. గతేడాదికి ఫీజులు నిర్ణయించి మూడేళ్లయింది. ఈ ఏడాది మరలా మూడేళ్లకు ఫీజు నిర్ణయం జరుగుతుందని కళాశాల యాజమాన్యాలు అంటున్నాయి. 


Updated Date - 2020-11-01T04:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising