ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణికిస్తున్న చలి

ABN, First Publish Date - 2020-12-28T05:38:18+05:30

ఏలూరు నగరంలో చలి వణికిస్తోంది. రాత్రే కాకుండా పగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.

మంచు కమ్మేసిన దృశ్యాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాత్రి 8 గంటలకే దుకాణాలు బంద్‌

 రహదారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు

రానున్న రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

ఏలూరు రూరల్‌, డిసెంబరు 27 : ఏలూరు నగరంలో చలి వణికిస్తోంది. రాత్రే కాకుండా పగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. సాయంత్రం కాక ముందే జనం ఇళ్లకు చేరిపో తున్నారు. రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతున్నాయి. మరోవైపు చలి కారణంగా రహదారులపై ప్రయాణం క్షణక్షణం భయంగా మారిందని దగ్గరకు వచ్చే వరకూ వాహనాలు కానరావడం లేదని వాహనచోదకులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజులుగా గ్రామాల్లో చలి గజగజ వణికిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలకు కూడా పొగ మంచు పడుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి మొదలవుతుంది. ఎముకలు కొరికే చలితో రాత్రంతా ఇళ్ళల్లో జాగారం చేస్తున్నట్లు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ  ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. 



Updated Date - 2020-12-28T05:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising