ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం.. భార్య, స్నేహితుడితో కలిసి..

ABN, First Publish Date - 2020-08-15T19:04:10+05:30

తన తల్లి జీతం సొమ్మును చెల్లి, బావ తీసుకోవడాన్ని ప్రశ్నించడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్తి కోసం బావమరిదిని చంపేశాడు

అతనికి సహకరించిన భార్య, స్నేహితుడి అరెస్టు 


ఏలూరు(ఆంధ్రజ్యోతి): తన తల్లి జీతం సొమ్మును చెల్లి, బావ తీసుకోవడాన్ని ప్రశ్నించడంతో కక్ష పెంచుకున్నాడు.. బావమరిదిని అడ్డు తొలగించుకుంటే అత్త తరపు ఆస్తి తనకు సొంతం అవుతుందన్న దురాశతో నమ్మించి హతమార్చాడు. అతనికి భార్య, స్నేహితుడు సహకరించారు. ఏలూరు టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిర ణ్‌ విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించి తెలి పిన వివరాలివి.. ఏలూరులోని ఆర్‌ఎంఎస్‌ కాలనీకి చెందిన ఖండ వల్లి శేఖర్‌బాబు (32)కు భార్య ఉంది. పెయింటింగ్‌ ప నులు చేస్తుంటాడు. తల్లి భీమడోలులోని ఒక వసతి గృహంలో వంట మనిషిగా పని చేస్తోంది. అతని సోదరైన హేమలతను ఏలూ రు లంకపేటనకు చెందిన చుండూరి సురేశ్‌ కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. శేఖర్‌బాబు తల్లికి వచ్చే జీతం సొమ్మును అతని సోదరి, బావ తీసేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ప్రశ్నించడంతో వారిద్దరూ కక్ష పెంచుకున్నారు.


బావమరిదిని అడ్డు తొలగిస్తే భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదని, అత్త తరపు ఆస్తి మొత్తం తమకే చెందుతుందని సురేశ్‌ కుమార్‌ భావించాడు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం ఈనెల 4వ తేదీ రాత్రి శేఖర్‌ బాబును మద్యం తాగడానికి తన ఇంటి కి రావాలంటూ ఒత్తిడి చేయడంతో వెళ్లాడు. ప్రణాళి క ప్రకారం మద్యం పట్టించి ఆపై రోకలి బం డతో సురేశ్‌ కుమార్‌, భార్య హేమలత, స్నేహితుడు వీవీ నగర్‌కు చెందిన పాతూరి మల్లికార్జునరావు కలిసి హతమార్చారు. మృతదేహాన్ని మోటారు సైకి ల్‌పై  పుష్పలీలా నగర్‌ ఐదవ రోడ్డు వద్దకు తీసుకెళ్లి పడ వేశారు. 5వ తేదీన ఈ ఘటనపై గుర్తు తెలియని మృతదేహం ఉందని టూటౌన్‌ పోలీసులకు సమా చారం అందడంతో   సీఐ బోణం ఆది ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ కేసు నమోదు చేశా రు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌ పర్యవేక్షణ లో  కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులై న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మృతుడికి చెందిన బంగారపు గొలుసు, మో టారు సైకిల్‌, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాఽధీనం చేసుకున్నారు.


Updated Date - 2020-08-15T19:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising