ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగంలోకి నిఘా విభాగాలు.. వివరాల సేకరణ

ABN, First Publish Date - 2020-12-10T05:30:00+05:30

అంతుపట్టని వ్యాధితో నగర ప్రజలు తల్ల డిల్లిపోతుంటే ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో వైద్య బృందాలతో పాటు నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి.

దీపిక నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 10 : అంతుపట్టని వ్యాధితో నగర ప్రజలు తల్ల డిల్లిపోతుంటే ఆ వ్యాధికి గల కారణాల అన్వేషణలో వైద్య బృందాలతో పాటు నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే బాధితుల రక్త నమూనాల పరీక్షలలో లెడ్‌, సీసం వంటి పదార్థాలు ఉన్నాయని ఇవి వాడేసిన బ్యాక్టరీల పొడి నీళ్లల్లో కలవడం ద్వారా ఆ నీళ్లను తాగి ఉండవచ్చని ప్రాథమికంగా భావించడంతో నిఘా విభా గాలు రంగంలోకి దిగాయి. ఏలూరులో బ్యాక్టరీ షాపుల నిర్వాహకులు వాడేసిన బ్యాక్టరీలను ఎక్కడ శుభ్రపరుస్తారు, వాటిని ఏమి చేస్తారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో చేరుతున్న బాధితులు ఏ ప్రాంతం వారు, వారు ఏ నీళ్లు తాగుతారు, వారి ఆహారం వంటి వివరాలు తీసుకుంటున్నారు. ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లికి చెందిన చల్లా దీపిక వన్‌టౌన్‌ ప్రాంతంలో ఒక స్వీటు షాపులో పనిచేయడానికి వస్తుంది. ఆమె నగరంలో వస్తున్న పంపునీళ్లే తాగుతూ ఉంటుంది. గురువారం ఉదయం యథావిధిగా షాపు లోకి వచ్చిన దీపిక ఫిట్స్‌ వచ్చి పడిపోవడంతో  ప్రభుత్వా స్ప త్రికి తరలించారు. చాటపర్రు కు చెందిన జామి ఆశా అనే బాధితురాలు, ఏలూరు మినీబైపాస్‌ రామకృష్ణాపురా నికి చెందిన శ్రావణి ఆస్పత్రి లో చేరడంతో వారు తాగేనీరుపై ఆరా తీశారు. ఏలూరు జిల్లా ఇంటిలిజెన్స్‌ డీఎస్పీ జీవీ కృష్ణారావు స్వయంగా తన బృందంతో బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నగరంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-12-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising