రూ.70 కోట్లతో ఏలూరు సుందరీకరణ
ABN, First Publish Date - 2020-11-04T04:39:26+05:30
ఏలూరు నగరాన్ని సుందరీకరణ చేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి శ్రీకారం చుట్టి నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మంత్రి ఆళ్ల నాని
ఏలూరు రూరల్, నవంబరు 3 : ఏలూరు నగరాన్ని సుందరీకరణ చేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి శ్రీకారం చుట్టి నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.70 కోట్లతో ఏలూరు నగరాన్ని అన్ని హంగులతో సుందరీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్కులు, శ్మశాన వాటికలు,సెంట్రల్ పార్కింగ్, డ్రెయినేజీ పనులు క్షుణ్ణంగా పరిశీలిస్తానన్నారు. కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూర య్యాయని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశిం చారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జనార్ధనరావు, ఏఈ నారాయణ అప్పారావు, ఇన్‌చార్జి కమిషనర్ బాపిరాజు, పీవో హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T04:39:26+05:30 IST