ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మరణాలు నిలువరించండి

ABN, First Publish Date - 2020-08-07T11:43:29+05:30

కొవిడ్‌ కారణంగా మరణాలకు దారి తీసిన పరిస్థితులను సమీక్షించడం ద్వారా మరణాలను నిలువరించాలని జిల్లా కలెక్టర్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షణాల నుంచి మరణం వరకూ సమీక్షించాలి : కలెక్టర్‌ ముత్యాలరాజు 


ఏలూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా మరణాలకు దారి తీసిన పరిస్థితులను సమీక్షించడం ద్వారా మరణాలను నిలువరించాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సూచించారు.కలెక్టరేట్‌లో గురువారం కొవిడ్‌ మరణాలపై సంబంధిత అధికారులతో సమీక్షిం చారు.ఇప్పటివరకూ జరిగిన మరణాల కేస్‌ షీటులను తెప్పించుకుని పరిశీలించారు. కొవిడ్‌ మరణాలను అరి కట్టడంలో అందరు సమష్టిగా పనిచేయాలన్నారు. తొలుత ఏ హాస్పటల్‌కు కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో వెళ్లారు. టెస్ట్‌ ఏ తేదీన చేశారు,ఎప్పుడు నిర్ధారణ అయింది, అక్కడ వైద్యం చేసిన వైద్యుని వివరాలు, వారు అందిం చిన చికిత్స తదుపరి కొవిడ్‌ హాస్పటల్‌కు సిఫార్సుచేసిన సమయం, అంబులెన్స్‌ వచ్చి తీసుకెళ్లిన సమయం, ఆసుపత్రిలో చేర్చుకున్న సమయం, చికిత్స ప్రారంభించిన సమయం మొదలు వారి చనిపోయేంత వరకు చికిత్స చేసి అందజేసిన మందుల వివరాలు సహా అన్నీ సమీక్షిం చాలన్నారు.


కొన్ని కేసులలో వైద్య సహాయం అందడంలో జాప్యం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటు వంటి ఆరోపణలకు తావు లేని విధంగా పనిచేయాలని వైద్యులకు సూచించారు.  ప్రతి వ్యక్తి ప్రాణం ఎంతో విలువైనదని, తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించాలని కోరారు. ఇప్పటి వరకు మరణాల కు దారి తీసిన పరిస్థితులను, ఒకసారి సమీక్షించుకుని, మరో మరణానికి అదే కారణంగా ఉండరాదని తెలిపారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) కె.వెంకటరమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) ఎన్‌.తేజ్‌భరత్‌, డీఎస్‌వో సుబ్బరాజు, కంటైన్మెంట్‌ జోన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం.వెం కటరమణ, మార్క్‌ఫెడ్‌ ఎండీ కె.నాగమల్లిక, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకరరావు, డాక్టర్‌ భానునాయక్‌, డాక్టర్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T11:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising