అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2020-11-04T04:49:38+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండాలని సమర్థంగా నిధులు నిర్వహించాలని ఏలూరు రేంజ్ డీఐజీ కెవీ మోహనరావు ఆదేశించారు.
సీఎం పర్యటన భద్రత ఏర్పాట్లపై డీఐజీ సమావేశం
ఏలూరు క్రైం, నవంబరు 3 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండాలని సమర్థంగా నిధులు నిర్వహించాలని ఏలూరు రేంజ్ డీఐజీ కెవీ మోహనరావు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను మంగళవారం ఎస్సీ నారాయణ నాయక్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద బందో బస్తు విధులకు హాజరయ్యే పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 11.22 వరకు నగరంలో కొనసాగుతుందన్నారు. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఎవరికి అప్పగించిన వారు సమర్ధంగా నిర్వహిం చాలన్నారు. నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచి ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహ రించాలన్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లా డుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే హెలీప్యాడ్ వద్దకు పంపించాలన్నారు. కల్యాణ మండపం వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి ముందుగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కల్యాణ మండపంలో 50 మందికి మించి అనుమతి లేదని ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలన్నారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు, ఇతర డీఎస్పీలు శ్రీనివాసరావు, పైడేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-04T04:49:38+05:30 IST