ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోళ్ల లక్ష్యం నెరవేరేనా..?

ABN, First Publish Date - 2020-12-01T05:40:17+05:30

రుస విపత్తులతో చేతికంది వచ్చిన పంట రైతు లకందే పరిస్థితి కనిపిం చడం లేదు. నివర్‌ తుఫాన్‌ దెబ్బకు మొత్తం ఊడ్చుకు పోయింది.

తడిచిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనాల్సిన ధాన్యం 14.04 లక్షల టన్నులు

ఇప్పటి వరకూ కొనుగోళ్లు 90 వేల టన్నులు

50 శాతం కేంద్రాల్లో మాత్రమే బోణి

మూడేళ్లగా రికార్డు స్థాయిలో సేకరణ

తడిచిన ధాన్యంపై రైతుల్లో ఆందోళన

ఏలూరు సిటీ, నవంబరు 30 : వరుస విపత్తులతో చేతికంది వచ్చిన పంట రైతు లకందే పరిస్థితి కనిపిం చడం లేదు. నివర్‌ తుఫాన్‌ దెబ్బకు మొత్తం ఊడ్చుకు పోయింది. సార్వా ఆరంభం నుంచి రైతులు కష్టాలే అనుభవించారు. నారుమళ్లు ప్రారంభం నుంచి బంగాళా ఖాతంలో వస్తున్న అల్ప పీడనాలు, ఉపరితల ఆవర్త నాలు, వాయుగుండాలు, తుఫాన్ల కారణంగా రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు నష్టపోయారు. ఈ ఏడాది 2.27 లక్షల హెక్టార్లలో సార్వా వరి సాగు చేశారు. సాధార ణంగా మొదట్లో ఇబ్బందులు పడినా ఏటా పంట చేతికొచ్చే సమయంలో ఇబ్బందులు ఉండకపోవటంతో దిగుబడులు బాగానే వస్తున్నాయి. ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో 40 శాతం మాత్రమే మాసూళ్లు జరిగాయి. మిగిలిన పంటలో 32 వేల 316 హెక్టార్లలో పంట నీట ముని గింది. మిగిలిన పంట మాసూళ్లు జరగాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లను ఈ ఏడాది నవంబరు 7న ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం పరిఽధిలోని ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని యోచించినా, ధాన్యం సేకరణకు అనుకూలంగా ఉండేందుకు జిల్లాలో 624 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 360 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. నివర్‌ తుఫాన్‌ రావటంతో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. డిసెంబరు నెలాఖరు నాటికి 8.50 లక్షల టన్నులు సేకరించ గలిగితే అనుకున్న లక్ష్యాలను సాధించటానికి వీలు కలుగుతుంది. పంటలు ఎక్కువగా నష్టపోవటంతో ఆ లక్ష్యం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. 


మూడేళ్లగా ధాన్యం సేకరణ ఇలా..

2017–18 ఖరీఫ్‌లో రూ.1671.64 కోట్ల విలువైన 10.71 లక్షల టన్నులు, రబీలో రూ.1510.07 కోట్ల విలువైన 9.63 లక్షల టన్నులు.

2018–19 ఖరీఫ్‌లో రూ.2017.82 కోట్ల విలువైన 11.50 లక్షల టన్నులు, రబీలో రూ.2150.35 కోట్ల విలువైన 12.25 లక్షల టన్నులు.

2019–20 ఖరీఫ్‌లో రూ.1987.15 కోట్ల విలువైన 10.93 లక్షల టన్నులు, రబీలో రూ.2227.25 కోట్ల విలువైన 12.26 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 

2020–21 ఖరీఫ్‌లో 14 లక్షల నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం కొనుగోలుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. కానీ, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటం, వరుస విపత్తులతో పంటలు దెబ్బ తినటంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం సందేహాస్పదమే..! ఇప్పటి వరకు రూ.166 కోట్ల విలువైన 90 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.12.50 కోట్లు జమ చేశారు. మరో రూ.56 కోట్లు రెండు, మూడు రోజుల్లో చెల్లించనున్నారు. 


90 వేల టన్నులు...

సార్వా ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 624 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయిం చారు. ఇందులో వెలుగు ద్వారా 189, డీసీఎంఎస్‌ 17, సహకార సంఘాల ద్వారా 418 ఉన్నాయి. వరుస విపత్తుల కారణంగా ఇప్పటి వరకు 360 కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేశారు. ఇందులో 233 సహకార సంఘాల లోను, 115 వెలుగు, 12 డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 


తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ? 

నివర్‌ తుఫాన్‌లో తడిచిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర బృందం పర్యటన తర్వాతే మార్గదర్శకాలు విడుదల అవుతాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతుల్లో కలవరం మొదలైంది. తడిసిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-01T05:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising