ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి దేవీ నవరాత్రులు

ABN, First Publish Date - 2020-10-17T11:23:58+05:30

దసరా ఉత్సవాలపై కొవిడ్‌ ప్రభావం పడింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నరాత్రులకు ఎటువంటి సందడి కనిపించదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా ఉత్సవాల నిర్వహణకు అనుమతుల్లేవ్‌

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి : పోలీసుల ఆదేశాలు


ఏలూరు క్రైం, అక్టోబరు 16 : దసరా ఉత్సవాలపై కొవిడ్‌ ప్రభావం పడింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నరాత్రులకు ఎటువంటి సందడి కనిపించదు. జిల్లావ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసు అధికారులు ఆదేశాలు జారీచేశా రు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణను అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విగ్రహాలు ఆరు బయట నెలకొల్పకూడదు. రోడ్లపై లైటింగ్‌, అలంకరణాలు చేయకూడదు. వాహనదారులను, పాదచారులను ఆపి చందాలు వసూలు చేయరాదు. గుడి లోపల మాత్రమే పూజారి పూజలు నిర్వహించాలి. పూజలకు భక్తులు గుమిగూడి రాకూడదు. కొవిడ్‌ నిబంధ నలు కచ్చితంగా పాటించాలి. గుడి వద్ద కమిటీ వారే రక్షణ చర్యలు చేపట్టాలి. గుడికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా కమిటీ వారే చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సహకరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-17T11:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising