జగన్‌తో బీసీలకు న్యాయం
ABN, First Publish Date - 2020-11-03T05:30:00+05:30
రాష్ట్రంలో సీఎం జగన్‌తో బీసీలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు.
ఏలూరు రూరల్, నవంబరు 3 : రాష్ట్రంలో సీఎం జగన్‌తో బీసీలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఆదిత్య ప్రిన్సిస్ హోట ల్‌లో జిల్లాలో బీసీ కార్పొరేషన్లకు నియమితులైన నలుగురు చైౖర్మన్లు, డైరెక్టర్లకు మంగళవారం సన్మానసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాని మాట్లాడుతూ సీఎం జగన్ బీసీల అభ్యున్నతికి బాటలు వేస్తూ 56 బీసీ కార్పొరేషన్లకు చైౖర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. బీసీ గర్జనలో ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కార్పొరేషన్ చైౖర్మన్లు, డైరెక్ట ర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వారికి మెమెంటోలు అందించి సత్కరించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, కొఠా రు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఎలీజా, తలారి వెంకట్రావు, దూలం నాగేశ్వరరావు, పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, గంటా ప్రసాదరావు, బొద్దాని శ్రీనివాస్, మరడాని రంగారావు, కిలాడి దుర్గారావు, ఎన్.సుధీర్‌బాబు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T05:30:00+05:30 IST