చీకటి వెలుగుల రంగేళి..
ABN, First Publish Date - 2020-11-14T04:56:12+05:30
వ్యాపారాలు మతాబుల్లా వెలిగి పోవాలి... విద్యా ర్థులు చదువులో చిచ్చుబుడ్డుల్లా చెలరేగి పోవాలి..
బాణసంచా దుకాణాలు వెలవెల
జిల్లాలో తగ్గిన కొనుగోళ్లు
కళ తప్పిన పండుగ
ఏలూరుసిటీ/పాలకొల్లు/ఏలూరు టూటౌన్, నవంబరు 13 : వ్యాపారాలు మతాబుల్లా వెలిగి పోవాలి... విద్యా ర్థులు చదువులో చిచ్చుబుడ్డుల్లా చెలరేగి పోవాలి.. నిరు ద్యోగులు తారాజువ్వల్లా అవకాశాలను అంది పుచ్చు కోవాలి..కష్టాలను బాంబులతో పేల్చి వేయాలి.. నష్టాలను చీకట్లోకి తరిమికొట్టాలి... ప్రతీ కుటుంబంలోను ఈ దీపావళి నూతన కాంతులను నింపాలి.. ఇదే దీపావళి పరమార్థంగా చెబుతారు. అయితే ఈ సారి దీపావళి కొత్త కాంతులను నింపడం మాట ఎలా ఉన్నా కరోనా ప్రభావంతో పండుగ సందడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇది వరకు దీపావళి అంటేనే వారం పది రోజుల ముందు నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సందడి కనిపించేది.ఈ ఏడాది మాత్రం దీపావళి ముందు రోజు కూడా ఎక్కడా ఆ సందడి కానరాలేదు. బాణ సంచా దుకాణాలు వెలవెలబోయాయి. కరోనా కారణంగా ప్రభుత్వం దీపావళి టపాసులు కాల్చుకునే సమయం రెండు గంటలకే కుదించడం.. కేవలం పర్యావరణ రహిత టపాసులకే కాల్చాలని నిర్ణయించడంతో సందడి అంత ంత మాత్రంగానే ఉంది.ఒక వైపు ఆర్థిక మాంద్యం మరో వైపు కరోనా కారణంగా ఈ ఏడాది దీపావళి కళ తప్పింది. పౌరు ల్లో పండుగపై పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు.ప్రతీ ఏడాది దీపావళికి వారం ముందుగానే బాణసంచా అమ్మకాలు ప్రార ంభమయ్యేవి.అయితే ఈ ఏడాది మాత్రం దీపావళి ముందు రోజు సైతం షాపులు వెలవెలబోయాయి. ఆంక్షల నడుమ టోకు వర్తకులు పరిమితంగానే సరుకు దిగుమతి చేసుకు న్నారు. ధరలు చుక్కలనంటడంతో ఈ సారి అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి.
దిబ్బి దిబ్బి దీపావళి...
భారతీయ సంస్కృతికి ప్రతిబింబం మన పండుగలు. సమైక్యంగా నిర్వహించే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని వధించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో దీపావళి పండుగను నిర్వహిస్తారని ప్రతీతి. మన జిల్లాలో ప్రత్యేకంగా దీపావళి రోజున సాయంత్రం సమ యంలో గోగు కర్రలకు గుడ్డలు కట్టి వెలిగించి పిల్లల చేత ఇంటి ముంగిట నేల మీద దివిటీలు కొట్టిస్తారు. దిబ్బి దిబ్బి దీపావళి.. మళ్లీ వచ్చే నాగుల చవితి.. పుట్ట మీద జొన్న కర్ర..పుటుక్కు దెబ్బ అని పాటలు పాడతారు. అనంతరం పిల్లల చేత మిఠాయిలు తినిపిస్తారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. ఆ తర్వాత లక్ష్మీపూజ చేసి ఇంటి దీపాలతో అలంకరిస్తారు. ఇంటి గుమ్మం మీద తులసి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె లేదా ఆవునేతితో దీపాలు వెలిగిస్తారు. కరోనా కారణంగా ఈ సారి చాలా మంది దీపాల వెలుగులతోనే దీపావళి పండుగను నిర్వహించాలని అనుకుంటున్నారు. దీపావళి మొదలు కుని కార్తీక మాసం చివరి వరకు ఈ దీపాలను ప్రతి రోజు ఇంటి వద్ద మహిళలు వెలిగించడం జరుగుతుంది. మొత్తం మీద పరిశీలిస్తే ఈ సారి దీపావళి పండుగ కళ తప్పిందని చెప్పవచ్చు.
2 గంటలే అనుమతి
దీపావళి.. ఆనందాల కేళి.. ఇది నిన్నటి మాట.. ఈ ఏడాది మాత్రం ఆ ఆనందం కరోనాలో కలిసిపోయింది.. ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీపావళి టపాసులు శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే కాల్చుకోవడానికి అను మతి లభించింది. కాలుష్య రహిత టపాసులు మాత్రమే కాల్చే విధంగా ఆంక్షలు విధించారు. బాణసంచా కాల్చే వారు చేతులకు శానిటైజర్ రాసుకోకూడదు. ఎక్కువ పొగ వచ్చే బాణసంచా కాల్చడంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను అమ్మేవారు, కాల్చేవారు తప్పకుండా పాటి ంచాలి.
కాలుష్య రహిత బాణసంచా కాల్చాలి
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలపై కాలుష్య రహితమైన బాణసంచా ఉపయోగించాలి. రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నియమ నిబంధనలు పాటించాలి. జనావాసాల మధ్య బాణసంచా కాల్చరాదు. ప్రభుత్వ ఆదేశాలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– నారాయణ నాయక్, ఎస్పీ
మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు
బాణసంచా కాల్చేవారు, అమ్మేవారు నిబంధనలు పాటించాలి. 30 శాతం పొల్యూషన్ లెవల్స్ ఉండే బాణ సంచా మాత్రమే కాల్చాలి. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాసులు కాల్చాలి. ఆ తరువాత కాల్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వవచ్చు.
– ఎ.వెంకట శంకరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి
శానిటైజర్ వినియోగించవద్దు
ఏ విధమైన ఆరోగ్య ఇబ్బందులున్నా బాణసంచా జోలికి వెళ్లకపోవడం మంచిది. బాణసంచా కాల్చే సమయ ంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాని టైజర్లు వినియోగించరాదు. శానిటైజర్ల బాటిళ్ళను మందులకు దూరంగా ఉంచాలి. చేతులకు రబ్బరు లేదా, ప్లాస్టిక్ గ్లౌజులు వినియోగించ కూడదు. కాటన్ దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.
– డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, పాలకొల్లు
Updated Date - 2020-11-14T04:56:12+05:30 IST