మద్యానికి బానిసై..
ABN, First Publish Date - 2020-12-12T04:30:40+05:30
మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు.
డ్రెయిన్‌లో పడి యువకుడి అనుమానాస్పద మృతి
తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబర్ 11 : మద్యానికి బానిసైన ఒక వ్యక్తి డ్రెయిన్‌లో పడి అను మానాస్పదస్థితిలో మృతిచెందాడు. సాలిపేటకు చెందిన గొర్తి కామేశ్వరరావు పెద్ద కుమారుడు నాగబాబు (36) వడ్రంగి పనిచేసుకుంటూ మద్యానికి బానిసై ఇంటికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మిపేటలోని మునిసిపల్ డ్రెయినేజీలో శుక్రవారం మృతదేహమై కనిపించాడు. మృతుడు నాలుగేళ్లగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. తండ్రి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గుర్రయ్య తెలిపారు.
Updated Date - 2020-12-12T04:30:40+05:30 IST