ధాన్యం కొనుగోలుకు రెడీ
ABN, First Publish Date - 2020-11-04T04:57:06+05:30
జిల్లాలో సార్వా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
7వ తేదీ నుంచి సార్వా ధాన్యం కొనుగోళ్లు
624 కేంద్రాలు ఏర్పాటు
లక్ష్యం 14.04 లక్షల టన్నులు
ఏలూరుసిటీ, నవంబరు 3 : జిల్లాలో సార్వా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో ఈ సారి 2.27 లక్షల హెక్టార్లలో సార్వా సాగు జరిగింది. సార్వా ఽధాన్యాన్ని 14.04 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 624 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో వెలుగు తరపున 189, సహకారం సంఘాలు తరపున 416, డీసీఎంఎస్ తరపున 21 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు డి.రాజు తెలిపారు. ఈ సారి ఆర్‌బీకే కేంద్రాల పరిధిలోనే ఈ ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వారి ధాన్యం సొమ్ములను జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత వరి కోతలు పూర్తవుతున్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. తేమశాతం 17 శాతం కన్నా తక్కు వగా ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించడం జరుగుతుంది. ఏ – గ్రేడ్ ఽధాన్యానికి టన్నుకు రూ.1888, కామన్ రకం ధాన్యానికి రూ.1868 అందిస్తారు.
Updated Date - 2020-11-04T04:57:06+05:30 IST