ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం’లో ప్రమాదం : బిహార్‌ కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2020-11-22T05:06:09+05:30

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పైనుంచి శుక్రవారం రాత్రి బిహార్‌కు చెందిన కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందినట్టు పోలవరం ఎస్‌ఐ ఆర్‌.శ్రీను తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, నవంబరు 21: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పైనుంచి శుక్రవారం రాత్రి బిహార్‌కు చెందిన కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందినట్టు పోలవరం ఎస్‌ఐ ఆర్‌.శ్రీను తెలిపారు. బీహార్‌ రాష్ట్రం కగారియా జిల్లాకు చెందిన మహ్మద్‌ ముర్తాజ(23) స్పిల్‌వేలో 29వ బ్లాక్‌పై కాంక్రీటు మెస్‌ పనులు చేసే నేపథ్యంలో కాలు జారి పక్కనే 29 మీటర్ల లోతులో ఉన్న షాఫ్ట్‌లో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆరు అడుగుల నీరు కూడా నిల్వ ఉండడంతో సంఘటనా ప్రాంతంలోనే అతను చనిపోయా డు. అతని తండ్రి వశిముద్దిన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాత్రి 2 గంటలకు క్రేన్‌ సహాయంతో మృత దేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కార్మికుడు మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కార్మికుడు జారి పడిన విషయం కాంట్రాక్టర్ల దృష్టికి తీసు కెళ్లినా వారు స్పందించకపోవడంతో కార్మికులు ఆగ్రహానికి గురై సంఘటనా ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్ల వాహనాలను ధ్వంసం చేశారు.  


రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి 

కార్మికుడి కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం అందించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సీఐటీయూ ప్రతినిధి బృందం పోలవరం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న కార్మికుడి మృతదేహాన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల వరకు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే కాంట్రాక్టర్లు కార్మికులపై ఎంతటి చులకన భావంతో ఉందో అర్థమవుతుందన్నారు. 

Updated Date - 2020-11-22T05:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising