ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనో..నో మాస్క్‌

ABN, First Publish Date - 2020-08-15T11:30:36+05:30

కరోనా నిరో ధానికి మాస్కుల పంపిణీ పూర్తిగా నిలిచి పోయింది. జిల్లాలో పది రోజుల్లో కోటి మాస్కులు పంపిణీ చేస్తా మని ఏప్రిల్‌ 10వ తేదీన అట్టహాసంగా ప్రక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన మాస్కుల పంపిణీ


ఏలూరు,ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరోనా నిరో ధానికి మాస్కుల పంపిణీ పూర్తిగా నిలిచి పోయింది. జిల్లాలో పది రోజుల్లో కోటి మాస్కులు పంపిణీ చేస్తా మని ఏప్రిల్‌ 10వ తేదీన అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం వంద రోజులైనా లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. జూలై నెల మొదటికి 90 లక్షల మాస్కులు పంపిణీ చేశారు.


గడిచిన నలభై రోజులుగా ఒక్క మాస్కు కూడా పంపిణీ చేయలేదు. ఏప్రిల్‌ 10 నుంచి మాస్కుల తయారీ ప్రారంభిం చాలని భావించినప్పటికీ ఏప్రిల్‌ 14 వరకూ వస్త్రం అందుబాటులోకి రాలేదు.ఆ తరువాత వస్త్రం కొంచెం కొంచెం అందు బాటులోకి రావడంతో 10 వేల మంది టైలర్లు జూలై నెల మొదటి వారానికి 90 లక్షల మాస్కులు తయారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 39,36,966 మంది జనాభా ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ 3 మాస్కుల చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా చేయాలంటే కోటీ 20 లక్షల మాస్కులు అవసరం.


అంటే మరో 30 లక్షల మాస్కులు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ప్రభుత్వం కోటి 5 లక్షల మాస్కులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటికి ఇంకా 15 లక్షల మాస్కులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే మాస్కుల తయారీ, పంపిణీ గురించి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, ప్రజలు అందరూ మర్చిపోవడం విశేషం. అయితే  మాస్కుల తయారీకి వస్త్రం మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో లక్ష్యం పూర్తి కాలేదని డీపీఎం మోహనబాబు చెప్పారు. 

Updated Date - 2020-08-15T11:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising