ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కేసులతో అప్రమత్తం

ABN, First Publish Date - 2020-04-03T11:51:45+05:30

లాక్‌డౌన్‌ 12వ రోజు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఏలూరు పట్టణ ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు దాటి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లకే పరిమితమైన ప్రజలు


ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 2 : లాక్‌డౌన్‌ 12వ రోజు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఏలూరు పట్టణ  ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు దాటి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఏలూరు పట్టణంలో ముఖ్యంగా కొన్ని చోట్ల ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. నిత్యావసరాలకు వచ్చేవారు అక్కడక్కడ కన్పిస్తున్నారు. ఆకతాయిలను పోలీసులు నిలువరిస్తున్నప్పటికీ వారు ఇళ్ళకు వెళ్ళడం లేదు. వీధుల్లో గుంపులు గుంపులుగా చేరుతున్నారు. జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వడంతో అన్ని వర్గాల్లో ఆందోళన మొదలైంది.


అధికార, పోలీసు యంత్రాంగం మరింత కఠినమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఢిల్లీలో మత ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారి ఇళ్ళ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇక గ్రామాల్లో సైతం అధికార, పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. 144 సెక్షన్‌ పటిష్టంగా అమలు జరుగుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 11 గంటల వరకూ మాత్రమే నిత్యావసర సరుకుల కోసం మాత్రం బయటికి వచ్చారు. అత్యవసర పనుల కోసం రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-04-03T11:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising