ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు రాదు.. మరణమే..!

ABN, First Publish Date - 2020-08-06T11:09:51+05:30

మత్తు రాదు.. మరణమే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యానికి బదులుగా శానిటైజర్ల వాడకం

మందు బాబుల ప్రాణాలకు ముప్పు


తాడేపల్లిగూడెం క్రైం, ఆగస్టు 5: మద్యం ధర రెం డింతలైంది. అదీ గంటల తరబడి లైన్లలో నిలబడి తేనే ఒకటో రెండో బాటిల్స్‌ దొరికేది. భౌతిక దూరం నిబంధనలు గాలికొదిలేయడంతో కరోనా భయం వెం టాడుతోంది. మద్యం మత్తుకు అలవాటు పడిన మం దు బాబులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. కరో నా కట్టడికి విరివిగా వాడుతున్న శానిటైజర్‌లో ఆల్క హాల్‌ ఉంటుందని భ్రమపడి కొందరు వాటిని సేవిస్తు న్నారు. ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉండడంతో మద్యానికి బదులుగా దీనిని ఎంపిక చేసుకుంటున్నా రు. మత్తుకోసం వినియోగించే వారి సంఖ్య నగరాలు, పట్టణాల్లో పెరుగుతోంది. శానిటైజర్‌ సేవనంతో వెలు గుచూసిన విషాద ఉదంతాలతో అధికారులు రంగం లోకి దిగారు. ఏలూరు నగరం, తాడేపల్లిగూడెం, భీమ వరం, తదితర పట్టణాల్లో మందు బాబులకు పోలీ సులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శానిటైజర్ల సేవనం వల్ల సంభవించే అనర్థాలను విడమరచి చెప్పారు. 


మద్యం ధరల వల్లేనా..?

మద్యం ధరలు అధికం కావడం వల్లే మందుబాబు లు కొందరు పక్కదారి పడుతున్నారు. ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉంటుందని భావించి శానిటైజర్ల వైపు చూస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో క్వార్టర్‌ బాటిల్‌ కనిష్ఠ ధర రూ.180 కాగా గరిష్ఠంగా రూ.250 ఉంది. మరోవైపు కొవిడ్‌ నిబంధనలతో పను ల్లేని వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మద్యం కొనుగోలు స్తోమత లేక తక్కువ ధరకు లభించే శానిటైజర్లను తాగేస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రతీ మందుల దుకాణంలో శాని టైజర్లు జోరుగా విక్రయిస్తున్నారు. 


గతంలో శానిటైజర్‌ ఉత్పత్తి తగినంత లేకపోవడం తో దుకాణదారులు ఆధార్‌ నెంబర్‌ నమోదు చేసుకుని విక్రయించేవారు. ప్రస్తుతం శానిటైజర్ల ఉత్పత్తి గణనీ యంగా పెరగడంతో పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్‌లో దాదాపు అన్ని దుకాణాల్లో శాని టైజర్లు విక్రయిస్తున్నారు. 100 మి.లీ. రూ.40 ధరకు లభ్యం కావడంతో శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్‌తో మత్తు వస్తుందని భావించి మందుబాబులు వాటితో గొంతు తడుపుకుంటున్నారు. శానిటైజర్‌ తాగితే కలిగే దుష్పరిణామాలపై అవగాహన లేని వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసు అధికారులు రంగంలోకి దిగి శానిటైజర్‌ తాగొద్దని అవగాహన కల్పి స్తున్నారు. మందుల షాపుల్లోను తనిఖీ నిర్వహించి విక్రయాలపై నిఘా వేశారు.


మత్తు కోసం వద్దు

మత్తు కోసం శానిటైజర్‌ తాగితే ప్రాణాలకే ముప్పు. ఇప్పటికే పలువురు చనిపోయారు. అంతేకాదు.. దీనిని తాగడం చట్టరీత్యా శిక్షార్హం. మత్తుకు బానిసైన వారు తెలియక వాటిని తాగేస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునే శాని టైజర్‌ తాగి ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకో వద్దు. ఇప్పటికే దీనిపై అవగాహన కల్పిస్తున్నాం.

 - రవికుమార్‌, సీఐ, తాడేపల్లిగూడెం రూరల్‌


శానిటైజర్‌ ప్రాణాంతకం

శానిటైజర్లలో ఇథైల్‌ ఆల్కహాల్‌ 98 శాతం ఉంటుంది. దీనిని తాగితే పెద్ద ప్రేగులు తీవ్రంగా ప్రభావితమై ప్రాణాంతకం అవుతుంది. లివర్‌ కూడా బాగా దెబ్బతినడంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. సాధారణ మద్యంలో 45 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. కానీ శానిటైజర్లు తాగడం వల్ల తీవ్ర ప్రాణ నష్టం ఏర్పడుతుంది.

- డాక్టర్‌ పి.బాలకృష్ణ, తాడేపల్లిగూడెం 

Updated Date - 2020-08-06T11:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising