ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు, వైద్య సిబ్బందికి సహకరించాలి

ABN, First Publish Date - 2020-03-29T10:52:03+05:30

కరోనా నివారణకు వైద్య, పారిశుధ్య, పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు


పాలకొల్లు అర్బన్‌/యలమంచిలి, మార్చి 28 : కరోనా నివారణకు వైద్య, పారిశుధ్య, పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు కోరారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రామా నాయుడు శనివారం పరిశీలించి, రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రెవేటు ఆసుపత్రులు మూసివేయడంతో రోగులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, వారికి సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు.


ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కొత్తవారిని నియమించాలని డీఎంహెచ్‌వో శంకర్రావును ఫోన్‌లో కోరారు. ఎమ్మెల్యేతో పాటు సూపరిటెండెంట్‌ డాక్టర్‌ గీతాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని అడవిపాలెంలో శనివారం దాత చెరుకూరి అంజిబాబు సహాయంతో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పేదలకు నిత్యావసర వస్తువులు నేరుగా వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజే యాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2020-03-29T10:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising