ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నాటికి రబీ పూర్తవ్వాలి

ABN, First Publish Date - 2020-11-29T05:39:11+05:30

పోలవరం కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గోదావరి కాల్వలు కట్టివేస్తున్నందున రబీ నారుమడులను వచ్చే నెల మొదటి వారంలో వేసుకోవా లని కలెక్టర్‌ ముత్యా లరాజు రైతులను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు

ఏలూరుసిటీ, నవంబరు 28 : పోలవరం కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గోదావరి కాల్వలు కట్టివేస్తున్నందున రబీ నారుమడులను వచ్చే నెల మొదటి వారంలో వేసుకోవా లని కలెక్టర్‌ ముత్యా లరాజు రైతులను కోరారు. వరి కోతలు ఏప్రిల్‌ 10 నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసు కోవాలని శనివారం ఓ ప్రకటనలో సూ చించారు. ఖరీఫ్‌లో వరి సాగు గోదావరి కాలువల కింద 3,44,356 ఎకరాలు సాగు చేయగా, రబీలో 3,18,393 ఎకరాల్లో సాగు చేయాలన్నారు. ఇప్పటి వరకు గోదావరి కాలువ కింద 2,22,532 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయన్నారు. రబీలో అనువైన రకంగా ఎంటీయూ–1121 అని పేర్కొన్నారు. డిసెంబరు మొదటి వారం లో నారుమడి వేయటం సాధ్యపడని వారు ఎంటీయూ 1121 రకాన్ని నేరుగా విత్తే పద్ధతి ని పాటించి 15లోగా పూర్తి చేయాలన్నారు. అలాగైతే కోతలు ఏప్రిల్‌ 10లోపు పూర్తవుతా యన్నారు. డిసెంబరు మొదటి వారంలో 64,313 ఎకరాల్లో ఖరీఫ్‌ కోతలు పూర్తవుతా యని, ఈ రైతులంతా తమ పొలంలో కొంత భాగం నారుమడి వేసుకోవాలన్నారు. వచ్చే నెల రెండు, మూడో వారాల్లో వరి కోతలు చేసుకునేవారు తప్పనిసరిగా పప్పు ధాన్యాలను లేదా పచ్చిరొట్ట పంటలను మాత్రమే వేసుకోవాలన్నారు. 


Updated Date - 2020-11-29T05:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising