నేడు ఏలూరుకు సీఎం
ABN, First Publish Date - 2020-11-04T05:04:17+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ నరెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు.
ఏలూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ నరెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. తొలుత వీవీ నగర్‌లో ఉన్న బెయిలీ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారు. అనంతరం తంగెళ్లమూడిలోని శ్రీ సూర్య కన్వెన్షన్ హాలులో జరగనున్న ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్– పెదబాబుల చిన్న కుమార్తె సాయి అమీద వివాహానికి హాజరవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఏలూరు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృష్ట్యా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చెప్పారు.ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వీఎల్ నగర్‌లో సీఎం ఆవిష్కరి ంచనున్న బెయిలీ బ్రిడ్జి శిలా ఫలకాన్ని వారిరువురు పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను పాటించేలా, తోపులాటలు లేకుండా ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ నారాయణ నాయక్, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
పటిష్ట పోలీస్ బందోబస్తు
ఏలూరు క్రైం, నవంబరు 3: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతా లను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు జాగిలాలు, బాంబ్ స్వ్కాడ్ బృందాలతో తనిఖీలు చేశారు. మొత్తం బందోబస్తులో ఎస్పీతో సహా అదనపు ఎస్పీ ఏడు గురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 54 మంది ఎస్‌ఐలు, 85 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 255 మంది కానిస్టేబుళ్ళు, 47 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 111 మంది హోంగార్డులు, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీ బృందాలు పాల్గొంటాయి.
Updated Date - 2020-11-04T05:04:17+05:30 IST