ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు చిన వెంకన్న దర్శన భాగ్యం

ABN, First Publish Date - 2020-08-01T11:04:27+05:30

కరోనా నిబంధనలతో మూతపడిన ద్వారకా తిరుమల ఆలయంలో చిన వెంకన్న శనివారం భక్తులకు దర్శనం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు ఆలయాలన్నీ మూసివేత


ద్వారకాతిరుమల, జూలై 31 : కరోనా నిబంధనలతో మూతపడిన ద్వారకా తిరుమల ఆలయంలో చిన వెంకన్న శనివారం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శనివారం ఒక్కరోజు మాత్రమే స్వామి వారి దర్శనం ఉంటుం దని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌.ప్రభాకరరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వేంకటేశ్వరరస్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. భక్తులు మొక్కబడులు తీర్చుకునేందుకు వీలుగా కేశ ఖండన శాలను కూడా తెరుస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో భాగంగా ఆదివారం ఆలయాన్ని మూసి వేస్తామని, స్వామివారికి ఏకాంత సేవలు, నివేదనలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. శనివారం నుంచి 4వ తేదీ వరకు స్వామి వారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు. పవిత్రోత్సవాల్లో స్వామి వారి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు జరగవని తెలిపారు.


రేపు మద్ది ఆలయం మూసివేత

జంగారెడ్డిగూడెం : సంపూర్ణ లాక్‌డౌన్‌లో భాగంగా ఆదివారం గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు కార్య నిర్వహణాధికారి టీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆలయాన్ని మూసివేసి స్వామి వారి నిత్య కైంకర్యాలు ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారన్నారు. సోమవారం  ఉదయం 6 గంటల తరువాత ఆలయాన్ని తెరుస్తామన్నారు.


నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు. ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలు, ఏకాంత పూజలు నిర్వహిస్తారన్నారు. సోమవారం ఉదయం నుంచి యథావిధిగా కొవిడ్‌ నిబంధనల ప్రకారం అమ్మవారి దర్శనం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-08-01T11:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising