ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కార్డుల్లో మార్పులకు ఛాన్స్‌

ABN, First Publish Date - 2020-05-13T09:59:15+05:30

రేషన్‌ కార్డుల్లో మార్పు లు,చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌/సిటీ మే 12: రేషన్‌ కార్డుల్లో మార్పు లు,చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పిల్లల పేర్లను చేర్చడం, వివాహమైన వారికి కొత్తకార్డుల మంజూరు,పేర్ల తొలగింపునకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికే రేషన్‌కార్డు స్థానంలో వార్షిక ఆదా యాన్ని బట్టి బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్‌, విద్యా దీవెన కార్డులను అందజేస్తోంది. కరోనా నేపథ్యంలో పౌర సరఫ రాల శాఖ పాత రేషన్‌ కార్డులపైనే బియ్యం అందిస్తోంది. కొందరు అర్హులకు బియ్యం కార్డులు మంజూరుకాలేదు. మరికొన్నిచోట్ల అనర్హులకు దక్కాయి. వీటిని అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. అర్హత కలిగిన వారికి బియ్యం కార్డులు జారీ చేసేందుకు చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.


కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరైనా కార్డులో లేకపోతే వారి ఆధార్‌ కార్డును రెవెన్యూ అధికారులకు అందజేయడం ద్వారా రేషన్‌ కార్డులో చేర్చ వచ్చు. కొత్తగా వివాహమైన జంటలు, వారికి పుట్టిన పిల్ల లతో కార్డు పొందాలంటే ఇంత వరకు తల్లిదండ్రులు ఉన్న రేషన్‌ కార్డు నుంచి తొలగించాలి. ఇతర ప్రాంతాల్లో వలసవున్న వారు అక్కడే రేషన్‌కార్డు పొందాలనుకుంటే ఇక్కడ కార్డులో పేర్లను తొలగించుకోవాలి. జిల్లాలో 11 లక్షల 73 వేల 403 బియ్యం కార్డులున్నాయి. వీటిల్లో పేర్ల తొగింపులు, చేర్పుల కోసం గ్రామ/వార్డు సచివాలయాల కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖా ధికారి ఎన్‌.సుబ్బరాజు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల డీటీ వెంకటేశ్వరరావు కోరారు.

Updated Date - 2020-05-13T09:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising