439 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-11-04T05:14:09+05:30
జిల్లాలో కరోనా ఉధృతి కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా 439 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో మొత్తం కేసులు 94,278
ఏలూరు, నవంబరు 3 : జిల్లాలో కరోనా ఉధృతి కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా 439 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 94,278కి చేరింది. అత్యధికంగా ఏలూరు 41 కేసులు నమోదు కాగా తాడేపల్లిగూడెం 30, నరసాపురం 29, భీమవరం 23, పాలకొల్లు 22, దేవరపల్లి 20 మినహా మిగిలిన అన్ని మండలాల్లో కేసుల సంఖ్య 15 కంటే తక్కువగానే నమో దైంది. తణుకు 14, పెదపాడు 12, పోలవరం 12, కొవ్వూరు 12, నిడదవోలు 11, దెందులూరు 11, కొయ్యలగూడెం 11, కామవరపు కోట 11, గణపవరం 10, పెంటపాడు 10, జంగారెడ్డిగూడెం 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.మిగిలిన మండలాల్లో కేసుల సంఖ్య ఒక అంకెకు పరిమితమైంది. కరోనా కారణంగా మంగళ వారం ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 501కి చేరింది.
Updated Date - 2020-11-04T05:14:09+05:30 IST