ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమలం..కొత్తదళం

ABN, First Publish Date - 2020-09-14T10:31:26+05:30

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లకు అవకాశం దక్కింది. మహిళా మోర్చాలో కీలకంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర కమిటీలో మాలతీరాణి, శ్రీనివాసవర్మకు చోటు

మహిళా మోర్చ అధ్యక్షురాలిగా నిర్మల కిశోర్‌

సీనియర్లకు దక్కని చోటు.. వెనుకబడిన మరికొందరు


(ఏలూరు - ఆంధ్రజ్యోతి):: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లకు అవకాశం దక్కింది. మహిళా మోర్చాలో కీలకంగా వ్యవహరిస్తున్న కొయ్యలగూ డేనికి చెందిన నిర్మలా కిషోర్‌కు ఈసారి అధ్యక్షురాలిగా అదృష్టం వరించింది. రాష్ట్ర కమిటీలో చోటు కోసం అనేక మంది సీనియర్లతో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు పోటీపడ్డారు. ఇంతకుముందు వివిధ పార్టీల నుంచి వచ్చి న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో పార్టీ పట్ల కీలకంగా వ్యవహరిస్తూ వివిధ సందర్భాల్లో మార్గదర్శకం వహిస్తున్న పాకా సత్యనారాయణ వంటి వారికి అప్పట్లో చోటు కల్పించారు. ఈసారి రాష్ట్ర కమిటీ కూర్పులో కేవలం ఇద్దరికే చోటు దక్కింది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా సీనియర్‌ నేత మాలతీరాణికి అవ కాశం ఇచ్చారు.


ఆమె గతంలో మహిళామోర్చ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిం చారు. పార్టీ పట్ల మొదటి నుంచి విధేయతతోపాటు మిగతా వారిని కలుపుకు పోయేందుకు ఎన్నడూ వెనకంజ వేయలేదు. కొంతకాలం రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలిగాను వ్యవహరించారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామా ల క్రమంలో మాలతీరాణికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. పార్టీ జిల్లా అధ్య క్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాసవర్మకు రాష్ట్ర కార్యదర్శి పదవితో సరిపె ట్టారు. వాస్తవానికి జిల్లా బీజేపీలో ముఖ్యులంతా ఈసారి రాష్ట్ర కమిటీలో వర్మ కు అధిక ప్రాధాన్యం కలిగిన పదవిని కేటాయిస్తారని భావించారు. క్షేత్రస్థాయి లో పార్టీకి ఊతమివ్వడమే కాకుండా నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు లోనూ ఆయన గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పైడికొండల మాణిక్యాలరావు ఇటీవల చనిపోయారు. ఆ పదవి శ్రీనివాసవర్మకు దక్కే అవకాశం ఉందని చాలామంది భావించారు.


కానీ రాష్ట్ర కార్యదర్శి పదవితో సరిపెట్టారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పార్టీకి ప్రాణం పోసిన ఘనత శ్రీని వాసవర్మదే. అందరిని కలుపుకుని పోవడంతోపాటు కీలక నిర్ణయాల్లోను, భీమ వరం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహణలోనూ ఆయనకు బీజేపీలో మంచి మార్కులే లభించాయి. పదవీ కాలం పూరైనా విడతల వారీగా జిల్లా అధ్యక్ష పదవుల్లో ఆయననే కొనసాగించారు. ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మ రింత కష్టపడి పార్టీ నిలదొక్కుకునేలా, అందరినీ కలుపుకుపోతూ సహేతుకమై న నిర్ణయాలతో రికార్డులు సృష్టిస్తాం. ఈ పదవి ఇచ్చిన పార్టీ ముఖ్యులకు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ధన్యవాదాలు’ అని శ్రీనివాసవర్మ అన్నారు. 


సీనియర్లకు  మొండి చేయి 

బీజేపీలో ఆది నుంచి సీనియర్లకే పెద్దపీట వేస్తారు. వివిధ అంశాలను క్రోడీకరించి పార్టీకి పూర్తిగా అంకితమై పనిచేస్తున్న వారిని గుర్తిం చి వారికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగినప్పుడు జిల్లాకు తగినంత ప్రాధాన్యం లభించింది. అప్పట్లో మాజీ మంత్రి, దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావుతోపాటు మరో సీనియర్‌ నేత పాకా సత్యనారాయణకు అవకాశం కల్పించారు. వీరిద్దరికీ అత్యధిక ప్రాధాన్యం కలిగిన పదవులు ఇచ్చారు. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మాజీ ఎంపీ, సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు, మరోనేత అంబికాకృష్ణ,  మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుల్లో ఇద్దరికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పి స్తారని కొందరు అంచనా వేశారు.


సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కూర్పు ఉంటుందని ఊహించారు. కానీ ఈ తరహా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సీనియర్లందరికీ ప్రస్తుతం అవకాశం కల్పించకపోయినా భవిష్యత్తులో వివిధ కమిటీల్లో చోటు కల్పిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. సభ్యత్వ నమోదులో సమన్వయకర్తగా వ్యవహరించి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కదిలిన తపన చౌదరి వంటి వారి పేర్లు రాష్ట్ర కమిటీలో కన్పించలేదు. ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన కోడూరి లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయ పర్చుకుంటూ ముందుకు వెళ్లినప్పటికీ  ఆయనకు అవకాశం దక్కలేదు. 


నిర్మలకు కలిసి వచ్చిన అదృష్టం 

మహిళా మోర్చలో అత్యంత కీలకంగా వ్యవహరించే నేతల్లో నిర్మలా కిషోర్‌ ఒకరు. చాలాకాలంగా ఆమె మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహ రించారు. సామాజిక వర్గాలు, రాజకీయాల్లో చురుకుదనం, మిగతావారిని ఆకర్షించే గుణం ప్రాతిపదికగా నిర్మలకు ఈ పదవి అప్పగించారు. పదవి తనకు రావడంపై ఆమె పార్టీ నాయకులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-09-14T10:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising