ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక స్టేషనే ఎందుకంటే..

ABN, First Publish Date - 2020-06-05T11:20:54+05:30

జిల్లా ప్రజల కోసం రైల్వే శాఖ ప్రధానంగా మూడు రైళ్లను నడుపుతోంది. తొలుత ఏలూరుతోపాటు తాడేపల్లిగూడెం, నిడ దవోలులో హాల్టింగ్‌ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరీక్షలు నిర్వహించలేక హాల్టింగ్‌ కుదించాలని రైల్వేకు రాష్ట్ర పభుత్వం లేఖ

తాడేపల్లిగూడెం, నిడద వోలులో ఎత్తివేత 

రైళ్లు ఆగేది ఏలూరు స్టేషన్‌లోనే.. క్వారంటైన్‌ కేంద్రాలకు తరలింపు భారం 

ప్రయాణికులకు ఇబ్బందులు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల కోసం రైల్వే శాఖ ప్రధానంగా మూడు రైళ్లను నడుపుతోంది. తొలుత ఏలూరుతోపాటు తాడేపల్లిగూడెం, నిడ దవోలులో హాల్టింగ్‌ ఇచ్చారు. రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆయా స్టేషన్‌లలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రైలు నుంచి దిగిన ప్రయాణికులను పరీక్షలు చేయాల్సి ఉం టుంది. అవసరమైతే క్వారంటైన్‌కు తరలిస్తారు. ఇటువంటి వ్యయ ప్రయాసలు భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లాలో ఏలూరుకే హాల్టింగ్‌ పరిమితం చేశారు. అక్కడనుంచే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి ఉంటుం ది. తొలుత రైల్వే శాఖ తాడేపల్లిగూడెం, నిడదవోలులో ఇచ్చిన హాల్టింగ్‌ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి జిల్లా వాసులు రైలు ఎక్కాలంటే ఏలూరు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా విశాఖ-నిజాముద్దీన్‌ ఏపీ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ - ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య రాక పోకలు సాగించే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి.


ఒక్క గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోనే మూడు రోజుల్లో తాడేపల్లిగూడెం నుంచి 500 మంది ప్రయాణం చేశారు. వారందరికీ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో తొలిరోజు తాడే పల్లిగూడెం నుంచి 150 మంది ప్రయాణం చేస్తే ఏలూరు నుంచి 50 మంది వెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో తాడేపల్లి గూడెం స్టేషన్‌ను హాల్లింగ్‌ నుంచి తొలగించడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు క్వారంటైన్‌ సెంటర్లు తాడేపల్లిగూడెం, భీమవరంలో ఉన్నాయి.ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా రు. నెగెటివ్‌ వస్తే ఇళ్లకు పంపుతున్నారు. ఏలూరులో హాల్టింగ్‌ ఇవ్వడం వల్ల క్వారంటైన్‌కు తాడేపల్లిగూడెం తీసుకురావాల్సి వస్తోంది. తాడేపల్లిగూడెంలో హాల్టింగ్‌ ఇస్తే ప్రయాణికులకు రాకపోకలతోపాటు, క్వారంటైన్‌ సెంటర్లకు తరలింపు సునా యాసం అవుతుంది. 3 స్టేషన్‌లలో హాల్టింగ్‌ ఉంటే పరీక్షలు వేగవంతం కానున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది.  

Updated Date - 2020-06-05T11:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising