ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్ధంగా ఉండండి

ABN, First Publish Date - 2020-03-28T10:30:18+05:30

‘జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు అదుపు తప్పి ఒకేసారి ఎక్కువ కేసులు నమోదైతే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇప్పటికి ఒక్క పాజిటివ్‌ కేసు లేదు 
  • ఎక్కువ కేసులు వస్తే సన్నద్ధంగా ఉండాలి 
  • 1600 ప్రత్యేక క్వారంటైన్‌ రూమ్‌లు 
  • ప్రైవేటు డాక్టర్లతో కలెక్టర్‌ ముత్యాలరాజు


ఏలూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు అదుపు తప్పి ఒకేసారి ఎక్కువ కేసులు నమోదైతే ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి’ అని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవే టు డాక్టర్లతో శుక్రవారం కలెక్టర్‌ సమావేశమై మాట్లా డారు. ఒక పాజిటివ్‌ కేసుకు చికిత్సకు ఎంత మంది సిబ్బంది, ఎక్యూప్‌మెంట్‌, మెడిసిన్‌ అవసరమో లెక్కించి ఒకేసారి వెయ్యి పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించాల్సి వస్తే ఎంత అవసరమో ఇండెంట్‌ను రూపొందించాల న్నారు. అవసరమైన సిబ్బంది, మెటీరియల్‌ తెప్పించుకుని స్టోర్‌ చేయాలన్నారు. సీరియస్‌నెస్‌ పెరిగితే గందరగోళ పరిస్థితి తలెత్తేలా ఉండకూడదన్నారు. జిల్లాలో 16 వంద ల ప్రత్యేక క్వారంటైన్‌ రూమ్‌లను సిద్ధంగా ఉంచామన్నా రు. అత్యవసర కేసులు వైద్యం అందించేందుకు ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, ఆంధ్రా హాస్పిటల్‌, ఆశ్రం హాస్పిట ల్‌ను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు.


65 ఏళ్లపై బడి పాజిటివ్‌ కేసు నమోదైతే వెంటిలేటర్స్‌ అమర్చి వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పా టు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆర్‌ఎంపీ, పీఎం పీ డాక్టర్లు ఎక్కువ మొత్తంలో చికిత్సలు చేస్తున్నారని, అక్కడ సామాజిక దూరం పాటించటం లేదని, ప్రభు త్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా ఉపయోగకరం లేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రు లన్నీ కరోనా కేసులకు మాత్రమే చికిత్స కేటాయించాలని, ఇతర అత్యవసర కేసులు వస్తే తమ ప్రైవేటు హాస్పిటల్స్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. డీఎంహెచ్‌వో సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్‌ఎస్‌ శంకర్‌రావు, ప్రైవేటు డాక్టర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-28T10:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising