నేడు విద్యార్థులకు బేస్‌లైన్ టెస్ట్
ABN, First Publish Date - 2020-03-16T11:40:43+05:30
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 15 : ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి ప్రారంభించనున్న వారథి(బ్రిడ్జికోర్సు)కు సంబంధించి నిర్వహించనున్న బేస్‌లైన్ టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష ముగిసిన వెంటనే జవాబు పత్రాలు మూల్యాకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా లెవెల్-1, లెవెల్-2 గా గుర్తించి రికార్డుల్లో నమోదు చేస్తామని డీసీఇబీ కార్యదర్శి వడ్లపట్ల మురళీకృష్ణ తెలిపారు. మంగళ, బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సు బోధన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని వివరించారు.
బ్రిడ్జికోర్సు బోధనకు గాను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 1.44 లక్షల హ్యేండ్‌బుక్స్‌ను ఇప్పటికే ముద్రించారని వీటిని సోమ, మంగళవారాల్లో ఆయా పాఠశాలలకు కాంప్లెక్స్‌ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో బ్రిడ్జి కోర్సు బేస్‌లైన్ టెస్ట్‌కు 1,26,685 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వివరించారు.
Updated Date - 2020-03-16T11:40:43+05:30 IST