ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ రికార్డులు పక్కా

ABN, First Publish Date - 2020-10-19T10:53:14+05:30

భూ రికార్డులు పక్కా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూ వివరాల స్వచ్ఛీకరణ 

తొలి దశలో రికార్డుల ప్రక్షాళన


ఏలూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): భూముల వివరాలు తెలుసుకోవడం, అందులోని నిజానిజాలను నిర్ధారణ చేయడం పెద్ద సమస్య. ప్రభుత్వ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న భూమి, వాస్తవంలో వేరే వారి అనుభవంలో ఉంటుంది. అందుకు కారణం రికార్డుల నమోదులో ఉన్న గందరగోళమే. బ్రిటిష్‌ వారి కాలంలో ఉన్న రికార్డులు మాత్రమే రెవెన్యూ శాఖ వద్ద ఉన్నాయి.  కాలక్రమంలో ఒక భూమి ఎంతో మంది చేయి మారి ఉంటుంది. ఈ మార్పు చేర్పులు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల భూ వివాదాలు జఠిలంగా మారుతున్నాయి. వీటిని చక్కదిద్దే దిశగా జిల్లాలో చర్యలు మొదలయ్యాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు జిల్లా రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది.  


300 రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభం

భూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా తొలిదశలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న మాన్యువల్‌ అడంగల్‌తో వెబ్‌ ల్యాండ్‌లో నమోదైన వివరాలను సరిపోల్చుతారు. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు మండలాలు గతంలో తెలంగాణలో ఉండడం కారణంగా రికార్డులు ఆ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అవి మినహా ప్రతి మండలంలో మూడో వంతు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి, వాటి రికార్డులను సరిచేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 953 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 6 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. అలాగే జిల్లాలో దాదాపు 18 లక్షల ఎకరాల మేర ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములు ఉన్నాయి. తొలి విడతగా దాదాపు 300 రెవెన్యూ గ్రామాల్లో రికార్డుల స్వచ్ఛీకరణ ప్రారంభమైంది. అందుకోసం 300 మంది వీఆర్‌వోలు, 300 మంది గ్రామ సర్వేయర్లు ఈ పనిలో ఉన్నారు. మిగిలిన 653 గ్రామాల్లో డిసెంబరు నెలాఖరుకల్లా రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జేసీ వెంకట రమణారెడ్డి చెబుతున్నారు. మూడు విడతల్లో వీటిని పూర్తి చేస్తామని అందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.


పరిశీలన ఇలా..

రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ఒక సర్వే నెంబరుకు సంబంధించిన వివరాలన్నిటినీ పరి శీలిస్తారు. ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి స్వభావం, విస్తీర్ణం, తరువాత కాలంలో వచ్చిన మార్పులు, చేర్పులు పరిశీలిస్తారు. అందుకోసం ఆర్‌ఎస్‌ఆర్‌, ఎఫ్‌ఎంబీ, ఆర్‌వోఆర్‌ రికార్డు, ఎఫ్‌ఎల్‌ఆర్‌, 22ఏ రిజిస్టర్‌, ప్రభుత్వ భూముల రిజిస్టర్‌, విలేజ్‌ మ్యాప్‌, మాన్యువల్‌ అడంగల్‌ తదితర పత్రా లన్నింటినీ వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌తో సరిపోల్చుతారు. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరిస్తారు.మరో 30 ఏళ్ల పాటు ఉపయోగపడేలా రికార్డులను సరిచేస్తామని జేసీ చెబుతున్నారు. తొలిదశలో రికార్డుల ప్రక్షాళన పూర్తిచేసి, మలి దశగా భూమి భౌతిక వివరాలు సేకరిస్తారు. జనవరి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వివరాలు నమోదుచేస్తారు. వీటిని తొలి దశలో ప్రక్షాళన చేసిన రికార్డులతో సరిపోల్చుతారు. సర్వే నెంబర్లకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సరిపోల్చి వ్యత్యాసాలు ఉంటే వాటిని కూడా సరిచేసి పూర్తిస్థాయి రికార్డును సిద్ధం చేస్తారు. 


Updated Date - 2020-10-19T10:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising