ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ లీక్‌.. కలకలం

ABN, First Publish Date - 2020-09-21T11:49:13+05:30

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ లీక్‌.. కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఏలూరు క్రైం, సెప్టెంబరు 20: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఆక్సిజన్‌ లీకవు తోందంటూ కలకలం రేగింది. ఆస్పత్రి మెడి కల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రమాదం లేదని కేవలం ఆక్సిజన్‌ పైపులకు మంచుగడ్డలు కట్టి అలా పొగ వస్తుందంటూ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో ఆస్పత్రిలో ఉన్న పడకలకు సెంట్రల్‌ ఆక్సిజన్‌ విధానా న్ని ఏర్పాటుచేశారు. ఆక్సిజన్‌ సరఫరా చేయడా నికి ఆస్పత్రి ఆవరణలో ఒక ట్యాంకును ఏర్పా టుచేశారు. ఈ ట్యాంకు వద్ద ఉన్న పైపులపై మంచుగడ్డ కట్టకుండా ప్రతి 30 నిముషాలకు ఒకసారి నీళ్లతో తడుపుతూ ఉండాలి. ఆదివారం సాయంత్రం వర్షం పడుతుండడంతో అక్కడ ఉండాల్సిన యువకుడు వెళ్లిపోయాడు. వర్షం తగ్గిన తర్వాత అతను రాలేదు. మరోవైపు ఆక్సిజన్‌ వాడకం ఎక్కువ కావడంతో పైపులు బాగా కూలింగ్‌ అయి పైపులపైన మంచుగడ్డలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలో మేఘంలా పొగరావడంతో ఆక్సిజన్‌ లీక్‌ అవుతుం దంటూ చూసిన వారు భయపడ్డారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ మోహన్‌ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి సిబ్బందిని పంపించి ఆ పైపులకు పట్టిన మంచుగడ్డలపై నీళ్లు చల్లించారు. మంచుగడ్డలన్ని కరిగిపోవడంతో పొగ ఆగిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



Updated Date - 2020-09-21T11:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising