ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం

ABN, First Publish Date - 2020-12-02T04:55:37+05:30

హెచ్‌ఐవి రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఎం.గోవిందబాబు అన్నారు.

భీమవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న డీఎన్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యా సంస్థలు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ


భీమవరం, డిసెంబరు 1 : హెచ్‌ఐవి రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాసుపత్రి వైద్యుడు ఎం.గోవిందబాబు అన్నారు. కృష్ణ యువజన సంక్షేమ సంఘం (కేవైఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం ఎయిడ్స్‌ డే నిర్వహించారు.  గోవిందబాబు మాట్లాడుతూ హెచ్‌ఐవి బాధితులు మనోసంకల్పంతో వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ, సరైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్‌ కె.నాగరాజు, పూర్ణేంద్ర, కేవైఎస్‌ఎస్‌ పీసీ ఈశ్వరి, ఎల్‌టి రామలక్ష్మీ, కె.శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.


భీమవరం ఎడ్యుకేషన్‌ / అర్బన్‌: పట్టణంలోని డీఎన్నార్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్‌ శాంతకుమారి మాట్లాడుతూ హెచ్‌ఐవీ నివార ణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పి.రామకృష్ణంరాజు, ఎంవీఎన్‌. భాస్కరరాజు, వీరయ్య, చెల్లబోయిన రంగారావు, ఎస్‌.అనిల్‌దేవ్‌, సోమయ్య, గౌతమ్‌కుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్‌ మేరిస్‌ ఆసుపత్రిలో ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. తోట భోగయ్య, సీఎస్‌ఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.సత్యనారాయణ, సిలిన్‌, అనిస్‌, ఆకుల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌: పట్టణంలో విద్యాసంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సులు నిర్వహించారు. ఏఎస్‌ఎన్‌ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.గిరి, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌. నాగమణి ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఎం.శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు నందుల రమణి ఆధ్వ ర్యంలో హెచ్‌ఐవి బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.


కాళ్ళ : పీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్‌ వైద్యాధికారి ఎం.గులాబ్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ పి రమామహేశ్వరి, డీసీఎంవో, సీహెచ్‌వో, ఎంపీహెచ్‌వో, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising