మందకొడిగా చెల్లింపులు
ABN, First Publish Date - 2020-03-16T11:52:12+05:30
ఇంటి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సాధారణంగా పన్ను వసూళ్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది.
పేరుకుపోతున్న ఇంటి పన్నులు
చెల్లించాల్సినవి రూ.276 కోట్లు
వసూళ్లకు ప్రత్యేక యాప్
తణుకు, మార్చి 15 : ఇంటి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సాధారణంగా పన్ను వసూళ్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఒక ఏడాదిలో మిగిలిన బకాయిలను మరో సంవత్సరం వసూలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య ఉత్పన్నమవుతోంది. బకాయిలు పేరుకుపోయి వసూళ్లు కష్టతరమవుతోంది. ప్రైవేట్ ఏజన్సీల ద్వారా పన్నులు వసూలు చేయిస్తూ ఇంటికి రూ.24 చొప్పున ప్రభుత్వం చెల్లించేది. ప్రస్తుతం అలాంటి పద్ధతిని తీసివేసి కొత్తగా పంచాయతీ యాప్‌నకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఇప్పటి వరకు 276 కోట్ల 44లక్షల 2 వేల 291 ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అయితే ఇటీవల ఎన్నికల హడావుడిలో పడి వసూళ్ల కార్యక్రమం మందగించింది. మళ్లీ సమయం రావడంతో వసూళ్లు వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎం-పంచాయతీ యాప్ ద్వారా వసూళ్లు
ఇప్పటి వరకూ ఆర్‌ఆర్‌ఐఎస్ అనే ప్రైవేటు ఆర్గనైజేషన్ ద్వారా ఇంటి పన్నులు వసూలు చేసేవారు. ఈ విధంగా వసూలు చేసినందుకు ఇంటికి రూ.24 చొప్పున సంవత్సరానికి 24 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రైవేటు ఏజన్సీకి చెల్లించేవారు. ప్రస్తుతం ఎం-పంచాయతీ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారానే త్వరలో ఇంటి పన్నులు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల ఫ్రభుత్వానికి ఎటువంటి ఖర్చు ఉండదు, నేరుగా యాప్‌లోనే నమోదు చేసి వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
డివిజన్ల వారీగా బకాయిలు ఇలా..
జిల్లాలోని నలభై ఎనిమిది మండలాల్లో ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం డివిజనల్ పరిధిలో 990 పంచాయతీలు ఉన్నాయి. వాటికి సంబంధించి డివిజన్ల వారీగా రావాల్సిన బకాయిల వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు డివిజన్‌లో 35కోట్ల 24లక్షల 28వేల 146లకు గానూ ఇప్పటి వరకూ 24కోట్ల 90లక్షల 9వేల 895 వసూలు చేయగా ఇంకా 10కోట్ల 34లక్షల 18వేల 251 వసూలు చేసి 70.66 శాతంగా నమోదైంది. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 13కోట్ల 61లక్షల 822 రూపాయలకు గానూ 8కోట్ల 80లక్షల 76వేల 723 రూపాయలు వసూలు కాగా ఇంకా 4కోట్ల 80లక్షల 25వేల 99 రూపాయలు వసూలు చేసి 64.71శాతం నమోదైంది.
కొవ్వూరు డివిజన్‌లో 24కోట్ల 89లక్షల 59వేల 175లకు గానూ 17కోట్ల 78లక్షల 28వేల 542 వసూలు చేయగా ఇంకా 8కోట్ల 11లక్షల 30వేల 633 వసూలు చేసి 68.67 శాతం నమోదైంది. నరసాపురం డివిజన్‌లో 23కోట్ల 23లక్షల 84వేల 167లకు గానూ 18కోట్ల 85లక్షల 15వేల 859 వసూలు చేసి ఇంకా 4కోట్ల 38లక్షల 68వేల 308 వసూలు చేయాల్సి ఉంది. మొత్తంగా 979కోట్ల 89లక్షల 3వేల 310లకు గానూ 703కోట్ల 43లక్షల వేయ్యి 19 రూపాయలు వసూలు చేయగా ఇంకా 276కోట్ల 44లక్షల 2వేల 291 వసూలు చేయాల్సి ఉంది.
Updated Date - 2020-03-16T11:52:12+05:30 IST