ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన 1152 మంది అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-03-29T10:55:22+05:30

లాక్‌డౌన్‌ ఆజ్ఞలను ఉల్లంఘించిన 1152 మందిని జిల్లాలో ఇప్పటి వరకూ అరెస్ట్‌ చేశారు.ప్రభుత్వం వెసులుబాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మార్చి 28 : లాక్‌డౌన్‌ ఆజ్ఞలను ఉల్లంఘించిన 1152 మందిని జిల్లాలో ఇప్పటి వరకూ అరెస్ట్‌ చేశారు.ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిన సమయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు నిత్యావసరాలు ఇతర సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1897 ఏపీ డమిక్‌ డిసీజ్‌ 188 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు.  జిల్లాలో సీఆర్పీసీ 144 సెక్షన్‌ కూడా విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే సీఆర్పీసీ 188 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.


మోటారు సైకిల్‌పై ఒక్కరే ప్రయాణించాలని, కారులో అయితే ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మోటారు వాహన చట్టం కింద ఇప్పటి వరకు 4,761 కేసులను నమోదు చేసి వారికి రూ.23,80,500లు జరిమానా విధించారు. ఇతర నిబం ధనలు అతిక్రమించిన వారిపై 358 కేసులు కట్టి 358 వాహనాలను సీజ్‌ చేసి 309 మందిని అరెస్ట్‌ చేశారు. 1897 ఎపిడమిక్‌ డిసీజ్‌ 188 సెక్షన్‌ క్రింద 90 కేసులు నమోదు చేశారు.మొత్తంగా 1152 మందిని అరెస్ట్‌ చేశారు.  

Updated Date - 2020-03-29T10:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising