ఏబీఎన్ ఎఫెక్ట్ : రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు... డీలర్‌షిప్ రద్దు
ABN, First Publish Date - 2020-04-17T17:21:01+05:30
ఏబీఎన్ ఎఫెక్ట్ : రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు... డీలర్‌షిప్ రద్దు
కాకినాడ: బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ షాపు డీలర్‌పై వేటు పడింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం సాయినగర్‌లో 147వ రేషన్ షాపు డీలర్‌షిప్‌ను జేసీ రద్దు చేస్తూ ఆదేశాలు చేశారు. లాక్‌డౌన్ బియ్యం పంపిణీలో డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏబీఎన్‌లో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన జేసీ వెంకటరమణారెడ్డి విచారణ జరిపి రేషన్ డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2020-04-17T17:21:01+05:30 IST