ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం అనుమతివ్వలేదు

ABN, First Publish Date - 2020-05-09T09:45:47+05:30

లాక్‌డౌన్‌ తర్వాత ఎల్‌జీ పాలిమర్స్‌ సహా ఏ పరిశ్రమను తెరిచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం చెప్పినందునే తెరిచారు : బొత్స


మహారాణిపేట(విశాఖ), మే 8: లాక్‌డౌన్‌ తర్వాత ఎల్‌జీ పాలిమర్స్‌ సహా ఏ పరిశ్రమను తెరిచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే, మూడో దశ లాక్‌డౌన్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, అందుకే ప్రారంభించి ఉంటారని అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


ఎల్‌జీ ఘటనలో బాధితులకు సీఎం జగన్‌ ప్రకటించిన పరిహారం శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, హోల్‌సేల్‌ మార్కెట్లు ఇకపై 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు. దీనికి మండల స్థాయిలో అనుమతులు ఇస్తారని వివరించారు. ఈ నెల 15 నుంచి రైతు భరోసా సాయం అందిస్తారని, అర్హులు పదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

Updated Date - 2020-05-09T09:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising