ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.వెయ్యి పంపిణీపై వివాదం

ABN, First Publish Date - 2020-04-07T10:30:49+05:30

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రూ.వెయ్యి సాయం విషయమై తలెత్తిన వివాదం చివరకు హత్యాయత్నానికి దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ కార్యకర్తపై క త్తితో వలంటీర్‌ దాడి

హత్యాయత్నం కేసు నమోదు 


కేవీ పల్లె, ఏప్రిల్‌ 6: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రూ.వెయ్యి సాయం విషయమై తలెత్తిన వివాదం చివరకు హత్యాయత్నానికి దారితీసింది. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం బండవడ్డికి చెందిన టీడీపీ కార్యకర్త పసుపులేటి విశ్వనాధరాజు తన సోదరుడి భార్య శ్రీదేవికి రూ.వెయ్యి ఎందుకు ఇవ్వలేదంటూ వలంటీరు పసుపులేటి శ్రీనివాసులును ఆదివారం  అడిగాడు. భర్త మృతి చెందిన తరువాత ఆమె కువైట్‌ వెళ్లిందని, అయితే ఆమె పేరుతో ఉన్న రేషన్‌కార్డుతో వస్తున్న సరుకులతోనే ఇక్కడున్న ఆమె పిల్లలు జీవనం సాగిస్తున్నారని వివరించాడు.


కాగా, శ్రీదేవి స్థానికంగా లేరు కాబట్టి ఆర్థికసాయం అందదని శ్రీనివాసులు తెలిపాడు. గ్రామంలో చాలామందికి కూడా రూ.వెయ్యి సక్రమంగా చెల్లించడం లేదన్న  విశ్వనాధరాజు....దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో కోపం పెంచుకున్న వలంటీరు సోమవారం విశ్వనాధరాజుపై కత్తితో దాడి చేశాడు. తల,మెడ, కడుపులో పొడిచి పరారయ్యాడు. గ్రామస్తులు క్షతగాత్రుడిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వలంటీరుపై హత్యాయత్నం కేసు నమోదు చే సిన ట్టు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు.

Updated Date - 2020-04-07T10:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising