ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయవద్దు

ABN, First Publish Date - 2020-10-31T08:40:00+05:30

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎం యూ డిపో కార్యదర్శి ఏఎస్‌ తాతాబాబు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌, అక్టోబరు 30: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎం యూ డిపో కార్యదర్శి ఏఎస్‌ తాతాబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక డిపో గేటు వద్ద యూనియన్‌ సభ్యులతో గేటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లకు సెలవులు ఇవ్వక పోవడం,  ఎంటీడబ్ల్యూ చట్టానికి అనుగుణంగా పనిగంటలను నిర్ణయించకపోవడంతో  బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిబ్బందికి రోటేషన్‌ పద్దతి లో డ్యూటీలు వేయాలని డిమాండ్‌ చేశారు. 


సాలూరు రూరల్‌: ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్‌ చటర్జీ ఎన్‌ఎంయూ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం తగదని ఆ యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి బి.సూర్యరాములు ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ ఎన్‌ఎంయూ కార్మికులు డిపో ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఎన్‌ఎంయూ నేత జి.జనార్థనరావు, సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. 


శృంగవరపుకోట: ఆర్‌టీసీ సిబ్బందిపెట్టే ఆన్ని రకాల సిక్‌లపై పూర్తి జీతం ఇవ్వా లని, సీనియారిటీప్రకారం రొటేషన్‌పద్దతిలో విధులు కేటాయించాలనీ ఎన్‌ఎంయుఏ ఆధ్వర్యంలో శుక్రవారం గేట్‌మీటింగ్‌ నిర్వహించారు. ఎస్‌.కోట ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ డిపో గేటు వద్ద నిర్వహించిన ఈకార్యక్రమంలో సంఘ ఆధ్యక్ష,కార్యదర్శులు జీవి. రమణ,  ఏ.రాజయ్య మాట్లాడి తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 

Updated Date - 2020-10-31T08:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising