ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2020-10-29T08:12:12+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో బ్యాంకుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు.బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌


కలెక్టరేట్‌, అక్టోబరు 28: ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో బ్యాంకుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు.బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల రాయితీలు, రుణాలను సకాలంలో అందించే బాధ్యత బ్యాంకర్లదేనన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉండాలంటే బ్యాంకులు సహకరించాలని చెప్పారు. జగనన్న తోడు పఽథకానికి సంబంధించి బ్యాంకుల రుణ వాటా సకాలంలో అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరావు, ట్రైనీ కలెక్టర్‌ కట్టా సింహచలం, ఆర్డీవో భవానీశంకర్‌, ఎల్‌డీఎం శ్రీనివాస్‌, నాబార్ట్‌ ఏజీఎం హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.


 కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

జల సంరక్షణలో జిల్లాకు జాతీయస్థాయి అవార్డు లభించడంపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. జేసీలు కిషోర్‌ కుమార్‌, జె.వెంకటరావు, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీఆర్‌వో గణపతిరావులు అభినంద నలు తెలిపారు.కలెక్టర్‌ కృషిని కొనియాడారు.  సీపీవో జె. విజయలక్ష్మి, డీపీవో కె.సునీల్‌రాజకుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి,డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు తదితరులు కలెక్టర్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.

Updated Date - 2020-10-29T08:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising