క్రషర్ కార్మికులను ఆదుకోండి
ABN, First Publish Date - 2020-10-04T10:48:37+05:30
గత ఏడాది కాలంగా జీతభత్యా లు లేక ఇబ్బందులు పడుతున్నామని అంబటి వలస గ్రామ పరిధిలో ఉన్న పైడిమాంబ బాలాజీ క్రషర్ కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు క్రషర్ ఆవరణలో శనివారం ఆందోళన చేపట్టారు.
బొండపల్లి: గత ఏడాది కాలంగా జీతభత్యా లు లేక ఇబ్బందులు పడుతున్నామని అంబటి వలస గ్రామ పరిధిలో ఉన్న పైడిమాంబ బాలాజీ క్రషర్ కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు క్రషర్ ఆవరణలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా తాళపూడి జనార్దన్, గౌరునాయుడుతో పాటు పలువురు కార్మికులు విలేకర్లతో మాట్లాడు తూ గత 30 ఏళ్లగా క్రషర్‌లో పనిచేస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నా మని జనవరి నెల నుంచి క్రషర్ మూసివేయడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యంతో పాటు లేబర్ కమిషనర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎన్.సూరిబాబు, కె.స్వామి నాయుడు, పి.చిన్న, శంకరరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T10:48:37+05:30 IST