వలంటీర్ల వ్యవస్థ అద్వితీయం
ABN, First Publish Date - 2020-10-03T10:06:43+05:30
గ్రామ, పట్టణ వార్డు వలంటీరు వ్యవస్థ అద్వితీయమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు. ఆ వ్యవస్థ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం నగరంలో వలంటీర్లు కేక్ కట్ చేసి ఆయనకు అందిం చారు.
బొబ్బిలి, అక్టోబరు 2: గ్రామ, పట్టణ వార్డు వలంటీరు వ్యవస్థ అద్వితీయమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు. ఆ వ్యవస్థ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం నగరంలో వలంటీర్లు కేక్ కట్ చేసి ఆయనకు అందిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ సత్ఫలితాలు సాధిస్తోందన్నారు.
పట్టణంలో గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ బెల్ట్ సొసైటీ ప్రతినిధులు ఎస్‌వీ రమణమూర్తి, కృష్ణదాసు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ నాయుడు, వైసీపీ నేతలు, మునిసిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-10-03T10:06:43+05:30 IST