ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ‘పట్టా’భిషేకం

ABN, First Publish Date - 2020-09-27T11:34:28+05:30

అటవీ భూములు సాగు చేసే గిరిజన రైతులకు వాటిపై హక్కులు కల్పిస్తూ...పట్టాలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

6,455 మంది గిరిజన రైతులకు పట్టాలు

మరో ఆరు రోజుల్లో పంపిణీకి అవకాశం

అధికారుల వద్దకు మరో మూడు వేల వినతులు


(పార్వతీపురం):చేస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు దీనిపై సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల 2న పంపిణీ కార్యక్రమం ఉండడంతో అప్పటికల్లా అన్ని పట్టాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం భూములపై హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. అనేక పర్యాయాలు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద వంటావార్పు చేశారు.


దీర్ఘకాలంగా పోరాటం చేస్తుండడంతో ప్రభుత్వం గిరిజనులకు పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు ప్రారంభించింది. అర్హులు.. భూముల వివరాలతో నివేదిక కోరింది. ఆ మేరకు పంపిణీకి గడువు విధించింది. పార్వతీపురం డివిజన్‌లో 6,300 మందికి 12,447 ఎకరాలు, విజయనగరం డివిజన్‌లో 155 మందికి 246 ఎకరాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


ప్రస్తుతానికి పార్వతీపురంలో 480 మందికి, కురుపాం మండలంలో 1758, గుమ్మలక్ష్మీపురంలో 931, కొమరాడలో 876, జియ్యమ్మవలసలో 563, మక్కువలో 495, సాలూరులో 447, పాచిపెంటలో 434, సీతానగరంలో 36, బొబ్బిలిలో 70, బాడంగిలో 23, ఆర్‌బీ పురంలో 187, నెల్లిమర్లలో 29, మెంటాడలో 32, వేపాడలో 43, బొండపల్లిలో 10, పూసపాటిరేగమండలంలో 41 మందికి ఇలా 6,455 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు.


  ఆర్‌వోఎఫ్‌ఆర్‌(రికగ్నైజేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) పట్టాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు. దీంతో అధికారులకు వివిధ మండలాల నుంచి వినతులు వస్తున్నాయి. మరో 3 వేల మంది గిరిజనులు విన్నపాలు ఇచ్చారు. వీరికి కూడా పట్టాలు అందించాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.


గిరిజనులందరికీ న్యాయం

ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గిరిజనుడికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. గిరిజనుల నుంచి ప్రత్యేకంగా కూడా వినతులు స్వీకరించాం. పట్టాల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని భావిస్తున్నాం.

Updated Date - 2020-09-27T11:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising