ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎందుకు స్థాపించనట్టు?

ABN, First Publish Date - 2020-09-23T11:32:30+05:30

బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు పదేళ్ల కిందట స్థలాలు పొందినప్పటికీ యూనిట్లు ఏర్పాటు చేయని వారందరికీ నోటీసులు జారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదేళ్లు దాటినా పరిశ్రమలు ఏర్పాటుచేయని వారికి నోటీసులు

12 ఒప్పందాలు రద్దు

ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుధాకరరావు


బొబ్బిలి, సెప్టెంబరు 22: బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు పదేళ్ల కిందట స్థలాలు పొందినప్పటికీ యూనిట్లు ఏర్పాటు చేయని వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుఽధాకరరావు తెలిపారు. 1,149 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రోత్‌సెంటర్‌లో 321 ప్లాట్లను ఏర్పాటు చేశామని, అందులో 210  అభివృద్ధి చేశామని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకొని పదేళ్లు దాటినా యూనిట్లు స్థాపించని 43 మందిని గుర్తించామని వివరించారు.


వారిలో 38 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. 12 ప్లాట్లకు సంబంఽధించిన ఒప్పందాలను రద్దు చేశామన్నారు. కొత్తగా ఐదుగురికి స్థలాలు కేటాయించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నూతన పారిశ్రామిక విధానానికి సంబంఽధించి ఇంతవరకు తమకు మార్గదర్శకాలు రాలేదన్నారు.


ఇండస్ర్టియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐలా) ఏర్పాటు కోసం పరిశ్రమల నిర్వాహకులు ముందుకు రావడం లేదని చెప్పారు. ఐలా ఏర్పాటైతే అభివృద్ధి సాధ్యమవుతుందని, పారిశ్రామిక యూనిట్ల యజమానులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నామని సుధాకరరావు తెలిపారు. 

Updated Date - 2020-09-23T11:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising