చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-03-02T10:32:13+05:30
చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
మెరకముడిదాం, మార్చి 1: బుధరాయివలస గ్రామానికి చెందిన రెడ్డి సీతారాం ఆదివారం చెట్టుపై నుంచి జారిపడి మృతిచెందాడు. గ్రామ సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు తీస్తుండగా, జారిపడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య సూర్యకాంతం బుధరాయివలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఎస్‌ఐ జనార్ధన్ ఘటన స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2020-03-02T10:32:13+05:30 IST