ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల కళ్లుగప్పి.. అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా..

ABN, First Publish Date - 2020-08-03T19:10:21+05:30

పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా గంజాయిని తరలించే క్రమంలో స్మగ్లర్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

100 కిలోల గంజాయి పట్టివేత

పరారైన నిందితులు.. పోలీసుల అదుపులో ఆటో, బైక్‌


శృంగవరపుకోట(విజయనగరం): పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా గంజాయిని తరలించే క్రమంలో స్మగ్లర్లు తప్పించుకోగా సు మారు వంద కిలోల గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే మం డలంలో బొడ్డవర- తాటిపూడి రోడ్డులో ఆదివారం బొడ్డవర ప్రాంతానికి చెం దిన గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో గంజాయి తరలించడానికి యత్నించారు. వీరికి ఎస్కార్ట్‌గా బైక్‌పై ఇద్దరు వ్యవహరించారు. పటిష్ట బందోబస్తు ఉన్న బొడ్డవర చెక్‌పోస్టును  గంజాయిని అవలీలగా దాటించి అక్కడినుంచి తాటిపూడి మీదుగా విజయనగరం తరలించాలని వీరి ప్రయత్నాలకు స్పెషల్‌బ్రాంచ్‌ పోలీ సులు చెక్‌పెట్టారు. నిందితులు మాత్రం తప్పించుకున్నారు. 


ఈ రవాణాకు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనాలను మాత్రం పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. అయితే, బొడ్డవర చెక్‌ పోస్టును గంజాయిని స్మగ్లర్లు ఎలా దాటించారా అనే విషయం అర్థం కావడం లేదని, చెక్‌పోస్టుపైనుంచి కాకుండా అడ్డదారిలో తరలించి ఉంటారన్న అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ ఎస్‌.శిరీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీఐ శ్రీని వాసరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గంజాయి దొరికిందని ఇంకా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు.  నిందితుల కోసం పోలీస్‌ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.


Updated Date - 2020-08-03T19:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising