ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల ధరలు పైపైకి

ABN, First Publish Date - 2020-03-24T08:02:28+05:30

కరోనా ప్రభావంతో కూరగాయల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కరోజులోనే వీటిధరలు రెట్టింపు కావడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజు వ్యవధిలో ధరల పెంపు  సామాన్యుల ఆందోళన


గజపతినగరం, మార్చి 23:  కరోనా ప్రభావంతో కూరగాయల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కరోజులోనే వీటిధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. శనివారం సాధారణ ధరలకే విక్రయించారు. సోమవారం నాటికి ధరలు పెంచడంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనతా కర్య్పూ వల్ల ఆదివారం ఒక్కరోజు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.  ఈ కారణంతో  ధరలు పెంచారు. వ్యాపారుల సిండికేట్‌ అయి నిలువు దోపిడీ సాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కిలో టమాటా రూ. 20నుంచి ఒక్క రోజు వ్యవధిలో రూ.40కి చేరింది.


ఇదేవిధంగా మిగిలిన కూరగాయల ధరలూ పెరిగిపోయాయి.  వంకాయలు కిలో రూ.50, బెం డకాయలు  రూ.50, దొండకాయలు రూ. 40క్యారెట్‌  రూ.60, బీట్‌ రూట్‌ రూ. 70 ప్రస్తుతం ధరలు పలుకుతున్నాయి.  రూ.10 విక్రయించే ఆకుకూరలను ధరలను పెంచి విక్రయిస్తున్నారు.


ఇలాంటి ధరలైతే ఏం బతకగలమని సామాఽన్య, మధ్య తరగతి కు టుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.  మొన్నటి వరకు రూ. 100 పెడితే సంచి నిండా సరుకులు లభించేవని, ప్రస్తుతం రూ. 500లకు వారం సరిపడా సరుకులు లభించడంలేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో  మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించాలని  కోరుతున్నారు.

Updated Date - 2020-03-24T08:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising