ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసరంగా తిరిగితే వాహనాలు సీజ్‌

ABN, First Publish Date - 2020-03-30T11:03:05+05:30

జిల్లాలో యువత ద్విచక్ర వాహనాలపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలతో పాటు వాహనాలు సీజ్‌ చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నివారణ అందరి బాధ్యత

ఎస్పీ రాజకుమారి

వృద్ధులకు మాస్క్‌ల పంపిణీ


విజయనగరం క్రైం, మార్చి29: జిల్లాలో యువత ద్విచక్ర వాహనాలపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలతో పాటు వాహనాలు సీజ్‌ చేయాలని ఎస్పీ రాజకుమారి పోలీసులకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ జరిగే రైతు బజారు, రాజీవ్‌క్రీడామైదానం, కోట జంక్షన్‌, రింగురోడ్డు ప్రాంతాలను ఆమె కలియదిరిగారు. షాపుల ఎదుట గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణ అందరి బాధ్యతని చెప్పారు. కొందరు గుంపు లుగుంపులుగా ఒకేచోటకు చేరి నిత్యావసర సరుకులు తీసుకునేందుకు వెళుతున్నారని చెప్పారు. మోటార్‌ సైకిల్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది వెళితే, మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకూ 16 వాహనాలు సీజ్‌ చేశామ ని అన్నారు.


విదేశాల నుంచి స్వదేశాలకు చేరుకున్న వ్యక్తులు 14 రోజులు పాటు క్వా రంటైన్‌లో ఉంచాలని ఆధికా రులకు సూచిం చామన్నారు. సామా జిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. అనంతరం వృద్ధులకు మాస్క్‌లు, పోలీసు అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు అందజేశారు. ఆమె వెంట ఓఎస్‌డీ రామ్మోహనరావు, డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, మోహనరావు, సీఐ ఎర్రన్నాయుడు, ఎస్‌ఐ జియాద్దీన్‌ ఉన్నారు. 

Updated Date - 2020-03-30T11:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising