ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగ బాలికకు అన్యాయం

ABN, First Publish Date - 2020-06-03T10:22:26+05:30

సిబ్బంది తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఓ దివ్యాంగ బాలిక నాలుగు నెలలుగా పింఛను కోల్పోయింది. దీనిపై బాధితురాలి తండ్రి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలస వెళ్లినట్లు తప్పుడు నివేదికతో పింఛన్‌ రద్దు


మెంటాడ, జూన్‌ 2: సిబ్బంది తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఓ దివ్యాంగ బాలిక నాలుగు నెలలుగా పింఛను కోల్పోయింది. దీనిపై బాధితురాలి తండ్రి మంగళవారం ఎంపీడీవోను కలిసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలంలోని ఇప్పలవలస గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక యమునకు ఈ ఏడాది జనవరిలో పింఛను మంజూరైంది. ఫిబ్రవరి నుంచి ఆమెకు పింఛన్‌ అందుతుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఒకసారీ కూడా అందలేదు. కారణం ఏమిటని వాకబు చేస్తే యమున కుటుంబం మొత్తం తాత్కాలికంగా వలస వెళ్లినట్లు గ్రామ కార్యదర్శి, వలంటీర్‌ తప్పుడు సమాచా రాన్ని అధికారులకు పంపారు.


ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అంటే నాలుగు నెల లుగా అందాల్సిన పింఛన్‌ బాధితురాలు యమునకు అందకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి గౌరి మంగళవారం కుమార్తె మయునను ఎత్తుకుని వెళ్లి ఎంపీడీవోను కలిసి గోడు విన్నవించుకున్నారు. ఈ విషయమై  ఎంపీడీవో భానుమూర్తిని వివరణ కోరగా విచారణ నిర్వహిస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు చర్యలు చేపడతానన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని చెప్పారు. 

Updated Date - 2020-06-03T10:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising