ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనం.. అభివృద్ధికి ఆమడ దూరం!

ABN, First Publish Date - 2020-08-09T10:44:32+05:30

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మా త్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆచార, సంప్రదాయాలకు ప్రతీక 

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


(పార్వతీపురం): స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మా త్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నా మని ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనల తప్ప గిరిజనుల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 


శ్రమకు మారుపేరు ఆదివాసీలు. వీరు నిరంతర శ్రమ జీవులు. ఎంత శ్రమించినా ఖాళీ సమయాల్లో మాత్రం ఆనందంగానే గడుపుతారు. ఆటలు, పాటలు, ఆనందోత్సా హాలకు ఖాళీ సమయాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తూ తమ సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందజేయాలనే సంకల్పంతో నేటికీ ఆచరిస్తూ వస్తున్నారు. గిరిజన సంప్రదాయాలు ఉట్టే పడే విధంగా ప్రభుత్వాలు, గిరిజన సంఘాలు, తదితరుల ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 9న అంతర్జాతీ య ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా నిరాడంబరంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 


ఇవీ పండగలు

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో గల గిరిజన ప్రాంతాల్లో కంది కొత్తలు, ఆగం పండగ, పిల్లి పండగ, చుక్క పండగ, టెంక, ఇటుక పండుగలను సాంప్రదాయ డప్పుల వాయిద్యాలతో గ్రామాల్లో గిరిజనులంతా ఏకమై నిర్వహిస్తూ తమ ఐక్యతను చాటుకుంటున్నారు.


వస్త్రధారణలో ప్రత్యేకత

ఆదివాసీల వస్త్రధారణలో ప్రత్యేకత ఉంది. చిన్న చీరతో ఒళ్లంతా కప్పుకొనేలా అడ్డ గుండారి కడతారు. ముక్కు, చెవులు, జుత్తుకు అలంకరణ వస్తువులు భిన్నం. చెవి తమ్మిట్లు, నాగులు, ముక్కుకు బేసర్లు, దండ కడియాలు ఆభకరణాల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 


వస్తువుల వినియోగం ఇలా

ఆదివాసీ గ్రామాల్లో ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో తయారు చేసేవస్తువులను వినియోగించుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది. డోకి, గిడుగులు, కొబ్బరి గరిటెలు, పండ్ల గంపలు, తిరగలి, కర్ర తిడ్డు, రోకలి, మట్టి కుండలు, తదితర వాటిని ఉపయో గించడం నేటికీ ఉంది.


నేస్తం అని పిలుపునకు పుట్టినిల్లు గిరిజన ప్రాంతం

నేస్తం అనే పిలుపునకు పుట్టినిల్లు గిరిజన ప్రాంతాలు. పూర్వం నేస్తం అనే పిలుపుతో ప్రారంభమే నేడు స్నేహం అనే పదానికి ప్రాణం అందించిన వారు గిరిజనులు. కష్ట కాలంలో ఒకరిని ఒకరు ఆదుకుంటారు. నేటికీ నేస్తాలకు తమ అటవీ ఉత్పత్తులను తీసుకుని వెళుతూ బహుమానంగా అందిస్తున్న గిరిజన మహిళలు ఎంతో మంది ఉన్నారు.


జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఆదివాసీ జనాభా 2,35,556 మంది. సబ్‌ ప్లాన్‌ మండలాల్లో గిరిజన జనాభా 1,87,829 మంది. ఇందులో జాతాపు 1,04,092 మంది. కొండ దొరలు 57456 మంది. సవర 31,983 మంది. గదబ 19164 మంది. ఎరుకులు 8189 మంది. మూకదొర 5062 మంది. మన్నెదొరలు 5052 మంది. కొండ కాపు 1860 మంది. బగత 1541 మంది. ఇతరులు 354 మంది.

Updated Date - 2020-08-09T10:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising